ముఖ్యమంత్రి మీద అవాకులు మాట్లాడితే నాలుక కోస్తాం

వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఎన్‌.పద్మజ 

చంద్రబాబూ తస్మాత్‌ జాగ్రత్త

పిచ్చి పిచ్చి వాగుడు మీ నాయకులతో మాట్లాడించొద్దు

అమాయక మహిళలను అడ్డం పెట్టుకుని మాట్లాడించొద్దు

తిరుపతి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అవాకులు, చ‌వాకులు మాట్లాడితే నాలుక కోస్తామ‌ని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్‌.పద్మజ హెచ్చ‌రించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.

నీ చరిత్ర అందరికీ తెలుసు:
    ఈరోజు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు చరిత్రను ఎవరడిగినా చెబుతారు. నేను చిత్తూరు జిల్లాకు చెందిన దాన్నే. అందుకే ఆయన చరిత్ర సమస్తం తెలుసు. లోకేష్‌ పీఏ తనను లైంగికంగా వేధించాడని, ఒక మహిళ ఆ పార్టీ కార్యాలయం ఎదుటే ఆందోళన చేస్తే, ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకే ప్రజల దృష్టి మరల్చడానికి ఇవాళ దీక్ష పేరుతో çసరికొత్త డ్రామాకు తెర లేపాడు.

చంద్రబాబూ గుర్తుంచుకో:
    ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఒక కీచకుడు తమకు మహిళలంటే గౌరవం ఉందంటే, ఎలా ఉంటుందో చంద్రబాబు వైఖరి కూడా అలాగే ఉంది.
ప్రజలకు సమాధానం చెప్పలేక, కొందరు అచ్చోసిన ఆంబోతులను ఎగదోసి, అవాకులు, చెవాకులు మాట్లాడిస్తున్నావు. చంద్రబాబు గుర్తుంచుకో. ఇలా మహిళలను అడ్డం పెట్టుకుని మాట్లాడిస్తే, ప్రజలు ఊర్కోబోరు.
    వైయ‌స్ జగన్‌గారు ఈ రెండున్నర ఏళ్లలో మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం చెప్పినవే కాకుండా, చెప్పనివి కూడా చేసి చూపించారు.
చంద్రబాబుగారు మీరు గతంలో మహిళల పుట్టుక గురించి కూడా దారుణంగా మాట్లాడారు. కోడలు కొడుకును కంటే అత్త వద్దంటుందా అన్నారు. మీ బావమరిది అయిన ఎమ్మెల్యే బాలకృష్ణ మహిళలను చూస్తే ముద్దు పెట్టుకోవాలినిపిస్తుంది అన్నాడు.

నాలుక తెగ కోస్తాం:
    ఇలా ఆడపిల్లలను అడ్డు పెట్టుకుని జగన్‌గారిపై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుక తెగ కోస్తాం. అందుకే మేము సిద్ధంగా ఉన్నాం.
    మహిళా పక్షపాతిగా జగన్‌గారు దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నారు. ఆయన చేస్తున్న పనులను ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేస్తున్నారు.
అవినీతి, అక్రమాలకు, అరాచకాలకు నీవు నిదర్శనం. నీ హయాంలో చెప్పుకోవడానికి కనీసం ఒక్క పథకం, కార్యక్రమం అయినా ఉందా?
అమ్మ ఒడి, ఉచిత ఇళ్ల స్థలాలు, సున్నా వడ్డీ, చేయూత, ఆసరా.. ఇలా చెప్పుకోవడానికి కనీసం ఒక్కటైనా ఉందా. 600కు పైగా హామీలిచ్చి ఏవీ నిలబెట్టుకోలేదు. 

ఎందుకీ డ్రామా?:
    నిన్నటికి నిన్న విజయవాడలో మీ పార్టీ నాయకుడి దారుణ లైంగిక వేధింపులకు ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించలేదు. అయినా ఏ ముఖం పట్టుకుని ఇవాళ సంకల్ప దీక్ష అంటూ డ్రామా చేస్తున్నావు.

నీ హయాంలో ఇవన్నీ..:
    వనజాక్షి అనే ఎమ్మార్వోను మీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దారుణంగా కొడితే ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చావు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌. దాన్ని నడిపిన వారికి పదవులు ఇచ్చావు. అది నీ చరిత్ర. అదే విధంగా గుంటూరులో మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ను అప్పటి మంత్రి రావెల కిషోర్‌బాబు వేధించాడు. ఆమె మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంది. విశాఖలో లావణ్య హత్య కేసును సెటిల్‌ చేశారు. గౌతమిని హత్య చేసి, దాన్ని కారు ప్రమాదంగా చిత్రీకరించారు. ఆమె సోదరి స్వయంగా చెప్పినా, ఎవరూ పట్టించుకోలేదు.
ఒంటరి మహిళపై పయ్యావుల కేశవ్‌ అనుచరులు దాడి చేసి, చెప్పులతో కొట్టారు. చిత్తూరు జిల్లాలో ఒక మహిళను వివస్త్రను చేసి వేధించారు. ఆమె వైయస్సార్‌సీపీ సానుభూతిపరురాలని హింసించారు. యాదమర్రి మండలంలో ఒక మహిళపై ట్రాక్టర్‌ తోలించారు. 12 ఏళ్ల బాలికను టీడీపీ నాయకుడు మహబూబ్‌అలీ గర్భవతిని చేసిన విషయం ప్రజలు మర్చిపోలేదు. అయినా ఆయనను నీవు వెనకేసుకొచ్చావు.

అందుకే బుద్ధి చెప్పారు:
    మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చింతమనేని ప్రభాకర్‌ వంటి వారు మహిళలపై చేసిన అరాచకాలను ప్రజలు గమనించారు. అందుకే మిమ్మల్ని ఓడించారు. అసెంబ్లీ సాక్షిగా దారుణాలను వ్యతిరేకిస్తే, ఎమ్మెల్యే రోజాను సస్పెండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. మహిళా పార్లమెంటు సభకు హాజరయ్యేందుకు వెళ్తే, ఆమెను కిడ్నాప్‌ చేసి ఎలా వేధించారో అందరికీ తెలుసు. 
    15 ఏళ్ల చిన్నారి క్యాన్సర్‌తో బాధ పడుతుంటే, బొండా ఉమా ఆ ఇంటిని స్వాథీనం చేసుకున్నాడు. బుద్ధా వెంకన్న చేసిన అరాచకాలను కధలు, కధలుగా ఇప్పటికీ విజయవాడలో చెప్పుకుంటారు.

ఒక్కటైనా చెప్పుకోగలవా?:
    మహిళల ఆర్థిక, రాజకీయ స్వావలంబన కోసం చంద్రబాబు ఒక్క పని అయినా చేశారా?. అదే జగన్‌గారు అనేక పథకాలు మహిళల కోసం అమలు చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ఏ ఒక్క పథకం, కార్యక్రమం ఆపకుండా అమలు చేస్తున్నారు. అన్ని వర్గాలు, కులాల వారికి ఆర్థిక స్వావలంబన వచ్చే విధంగా ఎన్నెన్నో అమలు చేస్తున్నారు.
    14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, మహిళల కోసం ఒక పని చేశానని ధైర్యంగా చెప్పగలరా? వీరికి అండగా నిలబడ్డానని చెప్పగలరా?. వీరికి మేలు చేశానని కనీసం ఒక్కరినైనా చూపగలరా? నీ అనుచరులు, నీ కుమారుడు, ఆయన పీఏ మహిళలను ఎలా వేధించాడో అందరికీ తెలుసు.

నీ కుమారుడి రాసలీలలు:
    నీ కుమారుడు స్విమ్మింగ్‌పూల్‌లో మహిళలతో ఎలా ఆడుకున్నాడో వీడియోలు అందరూ చూశారు. అర్ధనగ్నంగా స్విమ్మింగ్‌ పూల్‌లో తిరుగుతూ, మద్యం సేవిస్తూ ఆడపిల్లల కొలతలు టేపులతో కొల్చాడు. అవన్నీ అందరూ చూశారు. 
    దాన్నుంచి అందరి దృష్టి మరల్చడానికి పార్టీ ఆఫీసులో దుస్సలలతో దీక్ష చేయస్తున్నారు. మొత్తం దీనికి డైరెక్షన్‌ చంద్రబాబుగారు అయితే, స్క్రీన్‌ప్లే ఉత్తర కుమారుడైన లోకేష్‌ది. చంద్రబాబునాయుడు దుర్యోధనుడు. ఆయన డైరెక్షన్‌ చేస్తున్నాడు. అక్కడ దుశ్శలలు సంకల్పదీక్ష చేస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని పథకాలు:
    ఇవాళ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను మహిళా పక్షపాతిగా దేశమంతా చూస్తోంది. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన వారి కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
పెన్షన్‌ కానుక, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, మహిళల పేరుతో ఇళ్ల స్థలాలు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి అనేక పథకాలు, కార్యక్రమాలు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక మేనమామగా అమలు చేస్తుంటే.. ఏం చేయాలో తోచక ఇవాళ సంకల్ప దీక్ష అని చేయిస్తున్నారు. వారితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు.

మీకు ధైర్యముంటే..:
    చంద్రబాబుగారు మీకు ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడండి. నేను మహిళల కోసం ఇది చేశాను అని ఏదైనా ఉంటే చెప్పండి. అందుకే ఇప్పటికైనా ఇలాంటివి వెంటనే ఆపకపోతే, మీ అందరి నాలుకలు తెగ కోస్తారు. మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే, కనీసం దిశ చట్టాన్ని కూడా సమర్థించలేదు. అక్కడే మీకు చిత్తశుద్ధి లేదన్నది అర్ధమవుతుంది.

తస్మాత్‌ జాగ్రత్త:
    చంద్రబాబునాయుడుగారు తస్మాత్‌ జాగ్రత్త. పిచ్చి పిచ్చి వాగుడు మీ నాయకులతో మాట్లాడించడం, అమాయక మహిళలను అడ్డం పెట్టుకుని మాట్లాడించడం మానుకోండి. లేకపోతే మేమే మీ నాలుక కోస్తాం. అందుకు అందరం సిద్దంగా ఉన్నాం.. అని మరోసారి హెచ్చరించిన పద్మజ ప్రెస్‌మీట్‌ ముగించారు.

Back to Top