బాదంపప్పు కావాలా బాబూ!!

పొద్దున పేపర్ చూసిన దగ్గర్నుండీ తెగ ఆలోచించేస్తున్నాడు పప్పేష్‌.
అటూ ఇటూ తెగ తిరిగేస్తున్నాడు.
గూగుల్ లో బాగా వెతికేస్తున్నాడు.
''నాన్న వాష్ బోర్డు ఇప్పుడుంటే బాగుండేది. అందులో చూస్తే ఎక్కడెవరున్నారో తెలిసిపోయేది..
అప్పుడు నా పని ఈజీ అయిపోయేది'' అని తెగ మదనపడిపోతున్నాడు.
ఇంతలో అక్కడకొచ్చిన పీఏ ఏం చినబాబూ అలాగున్నావ్..అన్నాడు.
అర్జెంట్ గా అంటించుకోవాలి...అదే ఆలోచిస్తున్నా అన్నాడు..
అనుమానంగా చూసాడు పీపే..ప్రచారం కోసం పీక్స్ వెళ్లిపోతున్నట్టున్నాడు అనుకుని...
''బాబూ చినబాబూ అలా చేయకూడదు బాబూ. మనం ఎవరికైనా అంటిచాల అంతేగానీ మనం అంటించుకోకూడదు బాబూ'' అన్నాడు..చుట్టుపక్కలేమన్నా పెట్రోలు, కిరసనాయలు డబ్బాలున్నాయేమో అని వెతుకుతూ.
ఎహే ఇదిప్పుడు అంటించుకుంటేనే నాకు బావుంటుంది...మంకుపట్టుమీదున్నాడు పప్పేష్.
చినబాబు ఫిక్స్ అయిపోయినట్టున్నాడు.....పాలిటిక్స్ లో ఫూల్ అయిపోయి, సోషల్ మీడియాలో సిల్లీ అయిపోయి...ఎందుకూ గాకుండా బఫూనయిపోయిన బాధలో ఇలా నిర్ణయం తీసుకున్నాడో ఏమో..అర్జెంట్ గా బాబుగారికీ సంగతి చెప్పాలనుకుంటూ పరిగెత్తాడు పీఏ.
విషయం విని ఆఘమేఘాలమీద వచ్చిన పప్పేష్‌ డాడీ నిప్పు నాయుడు...ఏరా అంటించేసుకుంటావా? ఎందుకు? అంతకష్టం ఏమొచ్చిందని? నేనుండగా నీకంత ఖర్మేం పట్టిందీ అంట. అంత అవసరం అయితే రాష్ట్రం అంతా అంటించేద్దాం గానీ నువ్వు అంటిచుకోవాల్సినంత పరిస్థితి రానివ్వను అన్నాడు ఉద్వేగంగా.
అది కాదు నానా అందిరికి అంటిస్తే నాకేమొస్తుంది...నాకంటితేనే వస్తుంది...ఇదిగో మన భవగద్గీత పేపర్లో రాసారు చూడు అన్నాడు పప్పేష్.
అయోమయంగా పేపర్లోకి తొంగిచూసాడు నిప్పు నాయుడు.
''కరోనా సోకి క్వారంటైన్ లో ఉన్నవారికి బాదంపప్పు, జీడిపప్పు, గుడ్డు ఇస్తున్న ప్రభుత్వం'' అని హెడ్డింగ్ కనిపించింది.
ఇందుకే నాన్నా అంటించుకుంటానంటున్నా అన్నాడు పప్పేష్ నాలుక చప్పరిస్తూ...

Back to Top