చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు  

తాడేప‌ల్లి:  పింఛ‌న్ల పంపిణీని అడ్డుకున్న చంద్ర‌బాబు కొత్త‌గా డ్రామా మొద‌లుపెట్టార‌ని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు  మండిపడ్డారు. చంద్ర‌బాబు డ్రామాలు క‌ట్టిపెట్టాల‌ని హిత‌వు ప‌లికారు.  ప్రతి నెలా ఫస్ట్ తారీఖున పెన్సన్ల పంపిణిని అడ్డుకున్నదే నీవు. సిటిజన్స్ ఫర్ డెమక్రసీ సంస్ధ పేరుతో ఎన్నికల కమీషన్ కు వాలంటీర్ల ద్వారా పెన్సన్ పంపిణి వద్దంది నీవు కాదా అని ప్ర‌శ్నించారు. గురువారం మ‌ల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.

  •  నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదుతోనే కదా పెన్సన్ల పంపిణి ఆగింది.
  •  రమేష్ వెనక ఉన్నది నీవే అనేది రాష్ర్టంలో ప్రతి ఒక్కరికి తెలుసు.
  •  ఆ కారణంగా రాష్ర్టంలో వృధ్దులు పెన్సన్ తెచ్చుకునే క్రమంలో దాదాపు 33 మందికి పైగా మరణించిన విషయం నిజం కాదా.
  •  దానికి కారణం చంద్రబాబు చేయించిన ఫిర్యాదే కదా.
  • తిరిగి ఇప్పుడు పెన్సన్లు ఫస్ట్ తేదీనే ఇవ్వాలని ఎన్నికల కమీషన్ కు చంద్రబాబు లెటర్ రాయడం ఏంటి.
  • అంటే ఆపమని లెటర్ రాయించేది చంద్రబాబే...నేడు తిరిగి ఫస్ట్ తారీఖున ఇమ్మని డ్రామాలాడేది చంద్రబాబే.
  • ఇకనైనా ఈ డ్రామాలు చాలించాలి.ప్రజలందరికి నీ మోసపు బుధ్దులు,చిల్లర చేష్టలు తెలుసు.
  • వాలంటీర్ల వ్యవస్ధను తూలనాడి వారిని తొలగిస్తామని...వారి వల్ల ఉపయోగం లేదని...తాము వస్తే వాలంటీర్లను తొలగిస్తామని చెప్పిందీ చంద్రబాబు,పవన్ కల్యాణే.
  • ఎన్నికలు వచ్చే సరికి వాలంటీర్లను కొనసాగిస్తాం వారికి నెలకు పదివేలిస్తామని మోసపు మాటలు చెప్పడం చంద్రబాబుకే చెల్లుతుంది.
  • నెలకు 66 లక్షలకు పైగా వృధ్దులు,వితంతువులు,ఒంటరి మహిళలు,దివ్యాంగులు,కిడ్నీరోగులు తదితరులకు నెలా నెలా అందిస్తున్న పెన్సన్ సకాలంలో ఇంటివద్దకే అందేలా చేసిన ఘనత జగన్ గారిదే.
  • వాలంటీర్లపై లేనిపోని ఆరోపణలు చేసి వారిని ఇంటివద్దకు వెళ్లనీయకుండా చేసింది చంద్రబాబు అని పెన్సన్ అందుకుంటున్న ప్రతి ఒక్కరికి తెలుసు.
  • ఇలాంటి రెండు కళ్ళ సిధ్దాంతం చంద్రబాబుకు మొదటినుంచి అలవాటేనని అన్నారు. 
  • ఈ రోజు వృద్దులు చంద్రబాబుకి శాపానార్థలు పెడుతున్నారు.ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల కమిషన్ కి లేఖలు రాస్తునావు చంద్రబాబు.
  • పెన్షన్స్ విషయంలో చంద్రబాబు సైలెంట్ గా ఉంటే మంచిది.
Back to Top