ఓట‌మి భ‌యంతో బాబు నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్ కల్యాణ్ తాపత్రయం కనిపిస్తోంది.

2014లో బిజేపి, జన సేన టీడీపీకి మద్దతు ఇచ్చాయి.

అప్పుడు రాచి రంపాన పెట్టారు మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు.

ఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయి.

మీడియా అడిగితే చిరంజీవి, కూటమికి మద్దతు ఇవ్వడం మంచిదే... వ్యక్తులే కాదు శక్తులు అన్నీ ఏకమయ్యాయి అని వ్యాఖ్యానించాను.

శక్తులు ఎవరంటే టిడిపి,జనసేన,బిజేపి కలిశాయి అని అన్నా. 

చిరంజీవిని నేను విమర్శించానని ప్రచారం చేయడం ద్వారా కొంత మందిని అయినా దగ్గర చేసుకోవచ్చు అని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు.

డ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తూనే నవ్వొస్తుంది.

డ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది.ఏ డ్వాక్రా మహిళ దానిని మరిచిపోదు.

డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అని మోసం చేసింది చంద్రబాబే.

పవన్ కళ్యాణ్,చంద్రబాబులు  సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.

చంద్ర బాబుకు  ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసులను స్పందించకపోగా బెదిరింపులకు దిగుతున్నారు.

ప్రభుత్వ విధానాలపై మాట్లాడకుండా నోటికి వచ్చిన తిట్లు తిడుతున్నారు.అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం.

ఎన్నికల కమిషన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మేము భావించడం లేదు

2019 ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ బెదిరించిన వ్యక్తి చంద్ర బాబు.

టిడిపి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదులుచేసి బెదిరించే ధోరణిలో ఉంటున్నారు.

వాలంటీర్లని అడుగడునా దూషించిన చంద్రబాబు నేడు  వాలంటీర్లకు తాను అధికారంలోకి వస్తే పదివేలిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. 

తాడేప‌ల్లి: ఓడిపోతున్నాం అని తెలిసి చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిప‌డ్డారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే పవన్ కల్యాణ్ తాపత్రయం అని వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.తాడేపల్లిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదు. మీడియావాళ్ళు చిరంజీవి కూటమికి మధ్దతు ఇచ్చారు.... దీనిపై నా అభిప్రాయం అడిగితే దానిపై స్పందిస్తూ  చిరంజీవి కూటమికి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. కూటమితో చిరంజీవే కాదు ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పా. చిరంజీవిని నేను విమర్శించాను అని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు. నేను చిరంజీవిని కామెంట్ చేశానని ఇంతగా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆలోచిస్తే.... చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల శక్తి సరిపోదని భావించి చిరంజీవి అభిమానులు,ఆ సామాజిక వర్గం వారి ఓట్లను గంపగుత్తగా తీసుకువెళ్లి చంద్రబాబుకు ఎలా వేయించాలా అనే తపన,ఆత్రం అందులో కనిపిస్తున్నాయి.

       2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మధ్దతు ఇచ్చాయి.అప్పుడు ప్రజలను రాచి రంపాన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు” అని  మండిపడ్డారు. బాండెడ్  లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీ ముేందు సాగిలపడ్డాయి. ఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయి. వాళ్ళు ఓడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. డ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది.హాస్యస్పదంగా కనిపిస్తోంది. డ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 2014లో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీలు చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు సంస్కారం లేదు. చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా? చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?. చంద్రబాబు చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు?” ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా అని సజ్జల ప్రశ్నించారు.

  ఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. టిడిపి,జనసేన,బిజేపి కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. 2014లో చంద్రబాబు అలవికాని హామీలిచ్చి మోసం చేశారు. మేనిఫెస్టోను సైతం టిడిపి వెబ్ సైట్ నుంచి తొలగించారు. పవన్ కల్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు రోజు రోజుకు ప్రస్టేషన్ పెరుగుపోతోంది. వైయస్సార్ సిపి విజయం సాదించబోతోందని వారికి పూర్తిగా అర్థమైంది. విమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలి. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?. చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు. వైయస్సార్ సిపి అధికారంలోకి రాబోతుందనే చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల ఆందోళనగా కనిపిస్తోంది.

     చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసు స్పందించకపోగా బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన సభలలో మాట్లాడిన మాటలు చదివి వినిపించాలని అనుకున్నాకూడా సిగ్గేస్తుంది. ప్రభుత్వ విధానాలపై మాట్లాడకుండా నోటికి వచ్చిన తిట్లు తిడుతున్నారు. ఓటమి భయంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. వైయస్సార్ సిపి మేనిఫెస్టోను త్వరలోనే  విడుదల చేస్తాం అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మేము చంద్రబాబు కుటుంబాల గురించి మాట్లాడితే చంద్ర బాబు తలెత్తుకొని తిరగలేరు. ఎన్నికలు అంటే ఇచ్చిన హామీలు చేసిన పనుల గురించి మాట్లాడాలి. ఎన్నికలంటే ప్రజలకు సేవ ఎలా చేయాలి...వారితో ఎలా మమేకం అవ్వాలి....రాష్ర్టాన్ని ఏ విధంగా అభివృధ్ది పధంలోకి తీసుకువెళ్లాలి... పేదల కోసం సంక్షేమం ఎలా అందించాలి అనే అంశాలపై దృష్టి సారించాలి.కుటుంబాల గురించి కాదనే అంశాన్ని చంద్రబాబు గుర్తిస్తే మంచిదన్నారు.

     ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ వాళ్ల పని వాళ్లు చేస్తారు. కక్ష సాధింపు చర్యలకు ఎన్నికల కమిషన్ పాల్పడుతుందని మేము భావించడం లేదని అధికారుల బదిలీలను ఉద్దేశించి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధికారుల బదిలీల గురించి మేము ఏమి మాట్లాడం. ఎన్నికల నోటిఫికేషన్,కోడ్ అమలులోకి వచ్చినప్పటినుంచి జగన్ గారు ప్రజల మధ్యనే ఆయన గత ఐదేళ్ళుగా చేసిన అభివృద్దిని వివరిస్తూ ఓట్లడుగుతున్నారు.మద్దతు ఇమ్మని అడుగుతున్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకునీ ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ చూస్తోంది. 2019 ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి మరీ  బెదిరించిన వ్యక్తి చంద్రబాబు. టిడిపి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదులు పదే పదే చేసి అధికారుల్ని బెదిరిస్తున్నారు. కొన్ని అభూతకల్పనలను క్రియేట్ చేసి వ్యవస్థలను, ఎన్నికల కమిషన్ ను బెదిరించాలని చూస్తున్నారు. పెన్షన్లు పంపిణీ జరగకుండా అడ్డుకుంది తెలుగుదేశం పార్టీనే అని రాష్ర్టంలో
ని ప్రజలందరికి  తెలుసు. మళ్లీ ఇప్పుడు ఆలస్యం అవ్వకుండా ఫస్ట్ తేదీనాడు పెన్షన్లు పంపిణీ చేయాలని వాళ్లే గొడవ చేస్తున్నారు. వాలంటీర్లపై ఎల్వీ సుబ్రమణ్యం, నిమ్మగడ్డ రమేష్ లతో ఫిర్యాదులు ఇప్పించింది చంద్రబాబు అనేది బహిరంగ రహస్యం. వాలంటీర్లని అడుగడునా దూషించిన చంద్రబాబు నేడు  వాలంటీర్లకు తాను అధికారంలోకి వస్తే పదివేలిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.

Back to Top