చిత్తూరు: అభిమానుల మృతి పట్ల పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. అధికార మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అని పవన్‌కు ఆమె హితవు పలికారు. ఈ సందర్బంగా తల్లి రోధిస్తున్న వీడియోను తన ఎక్స్ ఖాతాలో రోజా షేర్ చేశారు. ‘కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్ కల్యాణ్?. ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!! అంటూ ఆర్కే రోజా ట్వీట్ చేశారు.