<strong>ఢిల్లీః</strong> దేశంలో మోదీ గ్రాఫ్ తగ్గిపోవడంతో చంద్రబాబు బీజేపీ నుంచి తెగతెంపులు చేసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు.నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు బయటకు వచ్చి ధర్మాపోరాటాలు అంటూ దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.మిత్రపక్షంగా కలిసి ఉన్నప్పుడు మోదీ చెప్పిన మాటలకు చంద్రబాబు ఎందుకు తల ఆడించారని ప్రశ్నించారు.రాష్ట్రానికి ప్రాణవాయువు అయినా ప్రత్యేకహోదాను కాదని ఎందుకు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నావో సమాధానం చెప్పాలన్నారు.ఏపీ ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు.ఏపీ ప్రజలు చంద్రబాబును క్షమించే పరిస్థితి లేదన్నారు.చంద్రబాబు తన పచ్చమీడియాతో ప్రజలను మోసం చేస్తున్నారని ఇది ఎంతకాలం సాగదని ధ్వజమెత్తారు.నాడు తొమ్మిది సంవత్సరాలు,నేడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజలు చంద్రబాబుకు గొప్ప అవకాశం ఇచ్చారని, ఆ ప్రజలను మోసం చేయడానికి మనస్సు ఎలా వచ్చిందని చంద్రబాబుపై మండిపడ్డారు.రాజకీయ,ఆర్థిక ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు.ఇంత నయవంచక వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజలు దురదృష్టకరమన్నారు.