అభివృద్ధిని గాలికొదిలేశారు..


దీక్షలంటూ చంద్రబాబు కాలయాపన..
వైయస్‌ఆర్‌సీపీ నేత పినేపే విశ్వరూప్‌..

ఢిల్లీః చంద్రబాబు రాష్ట్రాన్ని నిట్టనిలువునా ముంచాడని వైయస్‌ఆర్‌సీపీ నేత విశ్వరూప్‌ అన్నారు.రాష్ట్రంలో పరిపాలన గాలికొదిలి నవ నిర్మాణ దీక్ష, ధర్మపోరాట దీక్షలంటూ కాలయాపన పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా కేవలం దీక్షలు, పోరాటాలు అంటూ చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు.ఒక శాశ్వత కట్టడం కూడా అమరావతిలో కట్టలేదన్నారు.కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు.ఏపీకి జీవనాడి అయినా  ప్రత్యేకహోదా కూడా ఇవ్వలేదన్నారు.ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి, జాగృతి కలిగించడానికి వైయస్‌ఆర్‌సీపీ ఢిల్లీ స్థా«యిలో వంచనపై గర్జన నిరసన దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. 
Back to Top