ప్రత్యక్ష లబ్ధి పంపిణీ పద్ధతిలో రైతులకు రాయితీ

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఎరువుల రాయితీని ప్రత్యక్ష లబ్ధి పంపిణీ పద్ధతిలో రైతులకు అందజేయాలని నిర్ణయించినట్లు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి మన్షుక్‌ మండవీయ వివరణ ఇచ్చారు. పైలెట్‌ ప్రతిపాదికన 15 ఎంపిక చేసిన జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేసి స్థిరీకరణ జరిగిన తరువాత దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.ఇలా చేయడం వల్ల రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుందని ఎంపీ పేర్కొన్నారు.

Back to Top