చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తమ పార్టీ నుంచి ప్రజా ఉద్యమం తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పుంగనురు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. బుధవారం చిత్తూరులో ఆయన మాట్లాడారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉన్నదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.