

















ఆదిలాబాద్, 2 జూలై 2013:
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారంనాడు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారంనాడు ఇచ్చోడలో జరిగిన పార్టీ స్థానిక ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న శ్రీమతి విజయమ్మ రెండవ రోజు కూడా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె గుండంపల్లిలో హైలెవల్ కెనాల్ నిర్మాణంపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలుపుతారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గతంలో ఈ కెనాల్ కోసం వేసిన శిలాఫలకానికి జలాభిషేకం, క్షీరాభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీమతి విజయమ్మ నిజామాబాద్లో పర్యటనకు వెళతారు.