-ఎన్టీఆర్ చావుకు కారణం మీరు కాదా?- యనమల నోటిని ఫినాయిల్‌తో క్లీన్ చేయాలివైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతుంటే టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. వైయస్ జగన్ పాదయాత్రపై అవాక్కులు, చవాక్కులు పేల్చితే ఊరుకోమని హెచ్చరించారు. శనివారం జోగి రమేష్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు ఎన్టీఆర్ ను వెనక నుంచి వెన్నుపోటు పొడిస్తే ఆ కత్తి అందించింది యనమల రామకృష్ణడే అని ఆరోపించారు. ఎన్టీఆర్ నమ్మి యనమలకు స్పీకర్ పదవి ఇస్తే ఆయనను అసెంబ్లీ లో మాట్లాడకుండా చేసి అవమానించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో ఓడి పోయినా పిలిచి పదవిస్తే ఎన్టీఆర్ పార్టీని, జెండాను, గుర్తును లాక్కున్న చంద్రబాబు లాంటి దౌర్బాగ్యుడ్ని, నమ్మి స్పీకర్ పదవి ఇస్తే అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించిన యనమలను అసెంబ్లీలో చూడలేక ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారన్నారు. 20 మంది వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని, వారిలో నలుగుర్ని మంత్రులుగా చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టారని మండిపడ్డారు. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫిరాయింపు ఎమ్మెల్యేలతో తిట్టించడం దారుణమన్నారు. అప్పటి అప్రజాస్వామ్య విధానాలపై ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం మాదిరిగానే ఇప్పుడు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించారని వివరించారు. ఈ నిర్ణయంపై ఏ–1 ముద్దాయి జగన్ కు ఎన్టీఆర్ తో పోలిక అంటూ వ్యంగంగా మాట్లాడుతున్న యనమల నోటిని ఫినాయిల్ తో క్లీన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి విషయాలపై పూర్తి అసత్యాలు పలుకుతున్న యనమల ను ఏం చేయాలనేది ప్రజలే నిర్ణయించాలన్నారు. విలువలు, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే వైయస్ జగన్ వాటికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వని మీలాంటి వారికోసం అసెంబ్లీకి రావాలా? అమ్ముడు పోయిన మంత్రులను చూడటానికి అసెంబ్లీకి రావాలా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించేందుకు వెళ్తానంటే సోనియాగాంధీ అందుకు అంగీకరించలేదని కాంగ్రెస్ పార్టీని సైతం వదిలి బయటకు వచ్చిఏన వీరాధివీరుడు మా నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని కీర్తించారు. వైయస్ జగన్ పాదయాత్రకు విలువుందా అని చంద్రబాబు అంటున్నారని, ఆయన చేస్తే పాదయాత్ర.. వేరే వాళ్లు చేస్తే విలువుండదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు అబద్దాలు చెప్పారని విమర్శించారు. అధికారం కోసం నీలా మాట్లాడే నేత వైయస్ జగన్ కాదన్నారు. గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న రైతులకు, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయిన డ్వాక్రా అక్కచెళ్లెళ్లకు, ప్రత్యేక హోదా, పరిశ్రమలు అంటూ చెప్పి మోసగించబడ్డ నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకు వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారని జోగి రమేష్ వివరించారు. స్వచ్చమైన మనస్సుతో ప్రజల వద్దకు వైయస్ జగన్ వెళ్తుంటే చంద్రబాబు, మంత్రుల గుండెల్లో వణుకు పుడుతోందన్నారు. ప్రజా సంకల్ప యాత్రపై అవాకులు, చెవాకులు పేలితే ప్రజలు చూస్తు ఊరుకోరని జోగి రమేష్ హెచ్చరించారు.