విజయవాడ: వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ (UNGA) 29వ సెషన్‌కు వెళ్లే బృందంలో ఆయనకు స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారాయన. న్యూయార్క్(అమెరికా)లోని యూఎన్‌జీఏ 29వ సెషన్‌లో పాల్గొనబోయే బృందంలో ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం దక్కడం పట్ల ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఐరాస లాంటి గౌరవప్రదమైన వేదికపై దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రపంచ ఆసక్తులలో దేశ భాగస్వామ్యాలను మరింతంగా పెంచే అర్థవంతమైన చర్చల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాం అని ట్వీట్ చేశారాయన. నవంబర్ 18 నుంచి 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది.