పులివెందుల: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రెండో రోజు పులివెందుల పర్యటనలో బిజీగా గడిపారు. పులివెందులలో వైయస్ ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్ళిన వైయస్ జగన్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈ శ్రీధర్ రెడ్డి నివాసంలో ఇటీవల వివాహం జరిగిన నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. మాధురి, నరేంద్ర దంపతులను వైయస్ జగన్ ఆశీర్వదించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటనలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.