వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ నేత వైయస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాసేపటి క్రితం మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అభిషేక్‌రెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలిస్తున్నారు. రేపు(శనివారం) ఉదయం అభిషేక్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.