తిరుపతికి బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్‌

కాసేప‌ట్లో బాధితులకు మాజీ సీఎం పరామర్శ.. 

తిరుప‌తి: తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతికి బయల్దేరారు. కాసేపట్లో స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. 

వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని..అధికారుల హ‌డావిడి

తొక్కిసలాట ఘటన తర్వాత అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వకపోగా.. ఆపై సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో చేసిన హడావిడి చర్చనీయాంశమైంది. తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైయ‌స్ జగన్‌ పరామర్శిస్తారనే సమాచారం అధికారులకు అందింది. దీంతో.. ప్రభుత్వం అధికారులకు ఆగమేఘాల ఆదేశాలు జారీ చేసింది. తొలుత సీఎం చంద్రబాబు వచ్చి వాళ్లను పరామర్శిస్తారని.. అయితే వైయ‌స్ జగన్ వచ్చేలోపు ఆ క్షతగాత్రులను డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించేయాలని అధికారులకు అదేశాలు వెళ్లాయి. నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వాన్ని వైయ‌స్ జగన్‌ నిలదీస్తారనే భయం ఈ ఆదేశాలతో  కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

 

Back to Top