తొక్కిసలాటకు బాధ్యత ఎవరూ తీసుకుంటారు.?

మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు 

కాకినాడ‌ జిల్లా:  తిరుప‌తి తొక్కిసలాటకు బాధ్యత ఎవరూ తీసుకుంటార‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు. ఈ ఘ‌ట‌న‌పై టీటీడీ ఛైర్మన్ వాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని.. టీటీడీ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాజకీయాలు, ప్రచార ఆర్భాటాలు తప్పా దేన్ని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.లడ్డూలో కల్తీ జరిగిందని సాక్షాత్తూ వెంటేశ్వరస్వామిని రాజకీయానికి వాడుకున్నారు. టీటీడీ నిర్లక్ష్యానికి ఏడుగురు భక్తుల నిండు ప్రాణాలు బలైపోయాయి. పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోతే.. కనీసం ఒక్క నిముషం మృతుల కోసం చంద్రబాబు బాధపడిన సందర్భం లేదు.  ఇప్పటికైనా చంద్ర‌బాబు ప్రజల ముందుకు వచ్చి.. దేవుడు ముందు తప్పు తమదేనని లెంపలేసుకోవాల‌ని సూచించారు.  
 

Back to Top