తాడేపల్లి: మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణికి వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి, కుటుంబ సభ్యులు కలిశారు. తమపై అకారణంగా కేసులు పెట్టి వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైయస్ జగన్‌కు సుధారాణి, కుటుంబ సభ్యులు వివరించారు. సుధారాణి కుటుంబానికి అవసరమైన న్యాయ సహాయం అందజేస్తామని, కుటుంబానికి అండగా నిలుస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. వైయస్ జగన్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, అడ్వకేట్ పోలూరి వెంకటరెడ్డి, సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి ఉన్నారు.