అభిషేక్ పార్థివదేహానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు

 
వైయ‌స్ఆర్ జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ వైయస్‌ అభిషేక్‌ రెడ్డి పార్ధీవదేహానికి మాజీ సీఎం వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి,  వైయస్‌ భారతి, కుటుంబ సభ్యులు నివాళుల‌ర్పించారు. వైయ‌స్‌ అభిషేక్ రెడ్డి అకాల మ‌ర‌ణంతో వైయ‌స్ఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభిషేక్ రెడ్డి  తీవ్ర అనారోగ్యంతో  హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. చిన్నవయసులోనే అభిషేక్‌ మృతి చెందడం పట్ల  కుటుంబ స‌భ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో అభిషేక్‌ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.  ఈ క్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పులివెందుల చేరుకుంటున్నారు. 

Back to Top