వైయస్సార్సీపీ హర్తాళ్ విజయవంతం

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు తెలుగురాష్ట్రాల వ్యాప్తంగా వైయస్సార్సీపీ నిరసనలతో హోరెత్తించింది. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు వివిధ రూపాల్లో వైయస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినదించారు. గత 20 రోజులుగా సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్ విజయవంతం అయ్యింది. 

ఉదయం వేకువ జామునుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు కార్యాలయాలు, ఆర్టీసీ డిపోల వద్ద తమ నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. అరెస్ట్ లు చేసి పోలీస్ స్టేషన్ లకు తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల ఆక్రందనను తెలియజేస్తున్న తమపై ప్రభుత్వం, పోలీసులు దౌర్జన్యం చేయడంపై వైయస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పేద ప్రజలకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వైయస్సార్సీపీ శ్రేణులు హర్తాళ్ ను విజయవంతం చేశారు. 
Back to Top