<br/><strong>సత్తా ఉన్న నాయకుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి..</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కళావతి, పుష్పశ్రీవాణి</strong>శ్రీకాకుళంః వైయస్ జగన్ కోసమే హైకోర్టు విభజించారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు కళావతి,పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.పదేళ్ల ఉమ్మడి రాజధాని ఉన్నా ఓటుకు నోటు కేసుకు భయపడి అర్ధరాత్రి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. కుట్రపూర్వకంగా వచ్చిన కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్ అని తెలిపారు. కేంద్రం విభజన హామీలు నెరవేర్చలేదని గగ్గోలు పెడుతున్న చంద్రబాబుకు హైకోర్డు మంజూరయితే అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఏం జరిగిన వైయస్ జగన్‌కు ఆపాదించడం చంద్రబాబుకు అలవాటని ధ్వజమెత్తారు.కేసులకు భయపడి పూర్తికాని భవనాల్లోకి ఈ రోజు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.స్టేలతో తప్పించుకుని తిరుగుతున్నది చంద్రబాబే అని అన్నారు.జగన్ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు.డిసెంబర్ కల్లా భవనాలు పూర్తిచేస్తామన్న చంద్రబాబు బాహుబలి గ్రాఫిక్స్‌లు చూపిస్తున్నారని దుయ్యబట్టారు.రాజధానిలో ఒక శాశ్వతమై ఇటుక కూడా పడలేదన్నారు.ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై సమాన హక్కులు ఉన్నా కూడా çహుటహూటిన ఎందుకు అమరావతికి తరలివెళ్ళారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని స్వార్థ ప్రయోజనాలు కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు బలి తీసుకున్నారని మంపడిడ్డారు.వైయస్ జగన్ సత్తా ఉన్న నాయకులు కాబట్టే ధైర్యంగా అన్ని కేసులకు విచారణకు సహకరిస్తున్నారన్నారు.చంద్రబాబులాగా దొడ్డిదారిన వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. 40 అనుభవం అని చెప్పే చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.<br/>