<br/>ఐటి శాఖ దాడుల నేపథ్యంలో చంద్రబాబుకు చిత్త భ్రమణం మొదలైంది. తెలుగు తమ్ముళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆదాయపన్నుల శాఖ అధికారుల దాడులతో బాబు పని ఉక్కిరి బిక్కిరిగా ఉంది. దాంతో కంగారు పడి, తత్తరపడి, తొందరపడి, తన తప్పులు తానే ఒప్పుకునే స్థితికి వచ్చేశాడు బాబు.ఐటి శాఖ తన వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి కొందరి మీద దాడులు చేస్తుంది. పన్ను ఎగవేత దారులు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నవారు, బినామీలుగా పేరు పడ్డవారు, రాజకీయ పార్టీలకు సన్నిహితంగా ఉంటూ పెద్ద స్థాయి వ్యాపార లావాదేవీలు చేస్తున్నవారిపై నిఘా ఉంచి, అనుమానితులపై ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. వారి అనుమానాలు నిజమైతే, ఆధారాలు దొరికితే వారిపై తగు చర్యలు తీసుకుంటుంది. ఇది ఆ శాఖ కర్తవ్యం. కానీ చంద్రబాబుగారికి ఐటి అంటేనే అంతులేని మంటగా ఉంది. తన పార్టీ నేతలు, పార్టీ సానుభూతిపరులు అయిన వ్వాపారులు, కాంట్రాక్టర్లపై కావాలనే ఐటి దాడులు జరుపుతోందంటూ చిందులు తొక్కుతున్నారు బాబుగారు. అంతేకాదు తమ వాళ్లపై ఐటి దాడులు చేస్తున్నారు గనుక ఆ అధికారులకు సెక్యూరిటీ తీసేస్తాం అని బాబుగారు నేరుగా బెదిరిస్తున్నారు. ఆదాయపన్ను శాఖా అధికారులంటేబ బాబుగారి ఇంటి నౌకర్లా? వారి ఉద్యోగధర్మం, విద్యుక్త ధర్మం నిర్వహించకుండా అడ్డుకునే హక్కు ఓ ముఖ్యమంత్రి కి ఉంటుందా? అనుమానాలు, ఆధారాలు ఉంటే వారు ఆ ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా సోదా చేసే అధికారం ఆ శాఖాధికారులకు ఉటుంది. వారికి సెక్యూరిటీని తీసేస్తాననటం అంటే ప్రభుత్వోద్యోగులను బెదిరించడమే. మీకు భద్రత కల్పించం అని నిర్ణయం తీసుకోవడం వెనుక ముఖ్యమంత్రి భయం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే టిడిపి నాయకులపై ఐటి దాడులు చేయకూడదా? వారి అవినీతిని, అక్రమాలను చూసీ చూడనట్టు ఊరుకోవాలా? లేకపోతే అధికారులనే నేరుగా బెదిరిస్తారా? అదీ ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు ఇంత చవకబారు వాఖ్యలు చేయడం చూసి దేశం యావత్తూ విస్తు పోతోంది. ఇప్పుడే కాదు గతంలో ఓటుకు నోటు కేసులో ఆడియో టేపుల్లో బ్రీఫ్డ్ మీ అంటూ అడ్డంగా దొరికిపోయినప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే అడ్డంగా వాదించారు. నాకూ సిబిఐ ఉంది అంటూ దర్యాప్తు సంస్థల నిజాయితీపైనే అనుమానం కలిగేలా చేసారు. దర్యాప్తు సంస్థలన్నీ ఆయన జేబుసంస్థల్లా ఉండాలని, తాను చెప్పినట్టు వినాలన్న భావం చంద్రబాబుది. అధికారంలో ఉన్నారు కనుక తమపై, తమ మంత్రులు, నాయకులు, అనుయాయులపై ఐటీ దాడులు చేయకూడదని చెప్పడం అవినీతికి బాబు నేరుగా సపోర్టు చేస్తున్నాడన్న విషయాన్ని బైటపెడుతోంది. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర పరిధిలోని అంశమే అని వాఖ్యానించడంలో చంద్రబాబు ఐటి అధికారులపై రేపు తన వర్గం వారితో దాడులు జరిపించవచ్చన్న సంకేతాలనిస్తోంది. గతంలోనూ తిరుపతి వచ్చిన షా పై తెలుగుదేశం పార్టీ కి చెందిన రౌడీలతో కాన్వాయ్ పై రాళ్లు వేయించిన సంఘటనను ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. బిజెపితో తెగతెంపుల తర్వాత తిరుపతి వచ్చిన అమిత్ షా కన్వాయ్ పై టిడిపి అభిమానుల్లా వచ్చిన కొందరు దుండగులు దాడికి తెగబడ్డారు. ఇప్పుడు ఐటి అధికారుల విషయంలో చంద్రబాబు తీరు చూడబోతే తమ పార్టీ నాయకులను కాపాడుకునేందుకు ఐటి అధికారులు సోదాలు చేయకుండా ఉండేందుకు వారిని భయపెట్టే వ్యూహమేదో రచిస్తున్నట్టు కనిపిస్తోంది. <strong>అవినీతికి కొమ్ము కాస్తూ అధికారులకు బెదరింపు</strong>ముఖ్యమంత్రే బరితెగించి ఐటి అధికారులను తమ విధి నిర్వహణ చేయకుండా బెదిరింపులతో అడ్డుకోవడాన్ని వారి అవినీతికి పరాకాష్ట అని చెప్పాలి. అంటే రాష్ట్రంలో టిడిపి నాయకకులపై ఈగ వాలకుండా చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని తెలుస్తోంది. బిపెపి తమపై కావాలనే దాడులు చేయిస్తోందని, టార్గెట్ చేస్తోందని చెబుతున్న చంద్రబాబు నిజంగా తమ తెలుగు తమ్ముళ్లు సచ్ఛీలురు నిజాయితీ పరులైతే ఐటి సోదాలకు అడ్డు చెప్పాల్సిన పనేముంది. వారు ఎలాంటి అవినీతీ చేయని వాళ్లైతే దర్యాప్తు సంస్థలకు భయపడాల్సిన పనేమిటి? దాడుల గురించి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది? దర్యాప్తులో వారి నిజాయితీ నిరూపణ జరిగితే ఆ నాయకులపై, లేదా వ్యాపారాధిపతులపై ప్రజల్లో గౌరవం, నమ్మకం పెరుగుతాయి. లేక నిజంగా వారు అవినీతి పరులని తేలితే ఐటి శాఖ తన పని తాను చేస్తుంది. ఫలితం ఏదైనా కానీ ఐటి శాఖ విధులను నిర్వర్తించకుండా అడ్డుకునేలా చంద్రబాబు తీరు ఉండటం అందరి అనుమానాలకూ అసలైన సాక్ష్యాలను అందించనట్టే అవుతోంది. పచ్చపార్టీ నేతల విషయంలో పచ్చినిజాలు బైటపడతాయి కనుకనే బాబు అలా బెంబేలు పడుతున్నాడంటున్నారు. తెలుగుతమ్ముళ్లతో పాటు చంద్రబాబు భాగోతం కూడా ఇలాగే బైటపడే రోజు దగ్గర్లోనే ఉందంటున్నారు తెలుగు ప్రజలు.