రాష్ట్రానికి రక్షణ జగనన్న  

రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూళ్లలో మానవహారం

సీఎం వైయ‌స్ జగన్‌పై సోదర ప్రేమ వ్యక్తం చేసిన విద్యార్థినులు

అమ‌రావ‌తి: రక్షాబంధన్.. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పిల్లలు  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్ల సోదర ప్రేమ, కృతజ్ఞతను తెలియజేస్తూ ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. రాష్ట్రానికి రక్షణ మన జగనన్నే అని నినదిస్తూ విద్యార్థులు రాఖీ ఆకారంలో రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూళ్లలో మానవహారంగా ఏర్పడి తమ ప్రియతమ నాయకులు సీఎం వైయ‌స్ జగన్ పై సోదర ప్రేమ వ్యక్త పరిచారు. ఈ అందమైన రాఖీ ఆకారాలు రాష్ట్రంలో పిల్లలకు ఒక నాయకుడికి మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తుంది. 

 
 రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాల‌కు స‌దా కృత‌జ్ఞతుడిని. మీ సంక్షేమ‌మే ల‌క్ష్యంగా.. మీ ర‌క్షణే ధ్యేయంగా పాల‌న సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక‌ అన్నగా, ఒక‌ త‌మ్ముడిగా ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని మాట ఇస్తున్నాను!’ అని  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇవాళ ఉద‌యం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

తాడేప‌ల్లిలో మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజ‌రైన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రి తానేటి వ‌నిత‌, ఎంపీలు వంగా గీతా, చింతా అనురాధ‌, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి,  ఎస్సీ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ అమ్మాజీ, మ‌హిళా నాయ‌కురాళ్లు ష‌ర్మిల‌, త‌దిత‌రులు రాఖీ క‌ట్టి ఆశీర్వాదం పొందారు.

Back to Top