అత‌నొక్క‌డే సైన్యం

తిరుగులేని శ‌క్తిగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ

వైయ‌స్ఆర్ ఆశ‌య సాధ‌న కోసం ఆవిర్భ‌వించిన ప్ర‌జా పార్టీ

అతి త‌క్కువ స‌మ‌యంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ‌

ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్పాటుతో స‌క‌ల జ‌నుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు

రేపు 11వ వసంతంలోకి వైయ‌స్‌ఆర్‌సీపీ

అమ‌రావ‌తి : ఇడుపులపాయలో 2011మార్చి 12వ తేదీన దివంగత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  సాక్షిగా ఆవిర్భవించిన వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్క‌డితో మొద‌లై..వంద‌లు, వేలు, ల‌క్ష‌ల మందిని దాటి నేడు కోట్లాది మంది హృద‌యాల్లో సుస్థిర స్థానం పొందింది. మ‌హానేత ఆశ‌య సాధ‌నే ధ్యేయంగా ఆవిర్భ‌వించిన వైయ‌స్ఆర్ సీపీ రేపు అన‌గా మార్చి 12న 11వ‌ వసంతంలోకి అడుగిడుతోంది. అతి తక్కువ కాలంలో పార్టీకి పెద్ద సంఖ్యలో ప్రజలు అభిమానులయ్యారు. ప‌దేళ్ల‌లోనే ప‌టిష్ట‌మైన ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ‌న్న క‌ల‌ల‌ను సాకారం చేస్తూ..స‌క‌ల జ‌నుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌జేస్తున్నారు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. దేశంలోనే ఎక్క‌డా లేని సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, విప్ల‌వాత్మ‌క చ‌ట్టాలు, నిర్ణ‌యాల‌తో దేశానికే ఆద‌ర్శంగా నిలిచారు యువ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

 కాంగ్రెస్ పార్టీ క‌నుమ‌రుగు
 వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2010లో సోనియా గాంధీతో విభేదించి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు. 135 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రంలో క‌నుమ‌రుగైంది. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం, 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా, 12 ఏళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా చేసిన చంద్ర‌బాబు టీడీపీ పార్టీ కోట‌కు బీట‌లు వచ్చాయి. రాష్ట్రంలో మ‌రే పార్టీకి అంద‌నంత ఎత్తులో ఓట్ల శాతాన్ని పెంచుకొని తిరుగులేని పార్టీగా అవ‌త‌రించింది. 

రికార్డు విజ‌యాల‌తో ప్రారంభ‌మైన పార్టీ ప్ర‌స్తానం
 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌ 2011లోజరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్‌ విజయమ్మ, కడప ఎంపీగా వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో వైయ‌స్‌ జగన్‌  ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు.   2011లోఉప ఎన్నికలకు ముందు వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికల్లో వైయ‌స్‌ఆర్‌సీసీ అభ్యర్థి అఖండ విజయం సాధించారు.

కుట్ర‌లు, కుతంత్రాల‌ను ధీటుగా ఎదుర్కొని
2010లో వైయ‌స్‌ జగన్‌ బయటికి వచ్చిన నాటినుంచి కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు ప్రారంభించాయి.. వైయ‌స్సార్‌సీపీ కార్యకర్తలను, నేతలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా పావులు కదిపాయి. అక్రమ కేసులు మెదలుకొని..కార్యకర్తలను బెదిరించే స్థాయి వరకు ఎన్ని రకాలుగా హింసకు గురి చేసినా పార్టీ కోసం ప్రతి ఒక్కరూ అండగా నిలబడ్డారు.  2011నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నకాంగ్రెస్‌ పార్టీ వైయ‌స్‌ జగన్‌తోపాటు కార్యకర్తలను అణిచివేసే ప్రత్యేక కుట్రకు తెరతీశారు. 

 అనునిత్యం ప్రజల కోసం...
వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయ‌స్  జగన్‌  అనునిత్యం ప్రజల తరఫున ఉద్యమబాట పట్టారు. నాడు టీడీపీ ప్రభుత్వం అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు   పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేప‌ట్టారు. ప్రత్యేక హోదా కోసం ఆదినుంచి పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క వైయ‌స్‌ జగనే అన్న విషయం అందరికీ తెలుసు.  2017 నవంబరు ఆరో తేదీ  వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో తెలుసుకొని నేనున్నాన‌ని హామీ ఇచ్చారు. 2019లో రెండే పేజీల‌తో మేనిఫెస్టో రూపొందించి తానే ఏం చేస్తారో చెప్పి ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ప్ర‌జ‌లు జ‌న‌నేత‌ను న‌మ్మారు. ముఖ్య‌మంత్రి అయింది మొద‌లు మేనిఫెస్టోను ప‌విత్ర గ్రంధంగా భావించి ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తూ ఉన్నారు.  

సంపూర్ణ ప్ర‌జాబ‌లంతో ప్ర‌భుత్వం ఏర్పాటు

జననేత శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి నేతృత్వంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడచిన పదేళ్ళలో ఎన్నో సవాళ్ళను అధిగమించి సంపూర్ణ ప్రజా బలంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధికారం చేపట్టిన 20నెలల అతి స్వల్ప కాలంలోనే పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 90 శాతాన్ని మన పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారు పూర్తి చేసి దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా శ్రీ వైఎస్ జగన్ గారు అమలు పరుస్తూ... మన పార్టీ పట్ల ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతూ... మనం గర్వంగా తలెత్తుకు తిరిగేలా తిరుగులేని పాలన అందిస్తున్నారు.  అందుకు తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే తగిన ఉదాహరణ. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందన్న వాస్తవం మీ అందరికీ తెలిసిందే.   ఈ క్రమంలో వచ్చిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన అవసరం ఉంది.  నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలే ఊపిరిగా కృషి చేస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో  ప్రత్యేక స్థానం సంపాదించారు. ఈ  ప్రయాణంలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి  ఆంధ్రప్రదేశ్‌లో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ను బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. మ‌హానేత వైయ‌స్‌ఆర్‌ ఆశయాల సాధనే ధ్యేయంగా పార్టీ దూసుకెళ్తోంది.  ఈ క్రమంలో వచ్చిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 

నేడు రాష్ట్ర‌వ్యాప్తంగా ఆవిర్భావ వేడుక‌లు
 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, గ్రామగ్రామాన, ప్ర‌తీ పట్టణాల్లోని వార్డుల్లో, న‌గ‌ర కార్పొరేషన్ల పరిధిలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించాలని, ఘనంగా వేడుకలు నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుల చేశారు. ఈ మేర‌కు పార్టీ పండుగ ఘ‌నంగా నిర్వ‌హించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధ‌మ‌వుతున్నాయి.
 

 

Back to Top