మచిలీపట్నం: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఎదుర్కొంటున్నవైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)ని వైయస్ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. ఇవాళ మచిలీపట్నంలోని ఆయన నివాసంలో నానిని వైయస్ఆర్‌సీపీ మాజీ మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, పెడన సమన్వయకర్త ఉప్పాల రాము కలిశారు. ఈ సందర్భంగా పేర్నినానికి వారు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాల మీద నిలదీస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ... కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వ తీరుపై వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రుల నుంచి సాధారణ కార్యకర్తల వరకూ అందరిపైనా అక్రమ కేసులు బనాయిస్తూ.. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. అందులో భాగంగానే ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తున్న పేర్ని నాని కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తోందని... పేర్ని నాని కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.