తాడేపల్లి: 1971 యుద్ధంలో భారత దేశానికి గొప్ప చారిత్రక విజయాన్ని సాధించి, తమ ప్రాణత్యాగాలతో దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన వీర జవాన్లకు మనసారా వందనాలు అంటూ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. విజయ్ దివస్ యొక్క ఈ ప్రత్యేక రోజున, మన సాయుధ బలగాల ధైర్యసాహసాలు, వారి త్యాగాలను స్మరించుకుని, వందనం చేస్తున్నాము. చారిత్రాత్మక 1971 విజయంలో వారి పరాక్రమం, సంకల్పం ఒక దేశాన్ని విముక్తి చేసింది . చరిత్రలో భారతదేశ ధైర్యాన్ని నిలబెట్టింది .. జై హింద్ అంటూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.