టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది

రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు
 

ఢిల్లీ:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీబెదిరింపు రాజ‌కీయాల‌కు తెర‌లేపింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిప‌డ్డారు. ఏపీలో కూటమి నేతల ప్రలోభాలపై ఆయ‌న‌ ప్రశ్నల వర్షం కురిపించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను కుట్రపూరితంగా, ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి లాక్కురని టీడీపీపై విమర్శలు చేశారు.

నేడు రాజ్యసభలో ఎంపీలుగా సాన సతీష్‌, బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా నూతన ఎంపీల ప్రమాణం నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ ప్రలోభాలపై రాజ్యసభలో ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలతోనే వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన నేతలను టీడీపీ లాక్కుందని అన్నారు. టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.  

Back to Top