విశాఖపట్నం: వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని, ఈ ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది. మహిళలకు వైయస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగరంలో వైయస్ఆర్‌సీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, వైయస్ఆర్ విగ్రహాలకు పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు , ధర్మశ్రీ, వదురు కళ్యాణి, ఎంపీ తనూజ రాణి, కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్, కాయల వెంకట రెడ్డి, చెంగల వెంకట్రావు, కొండ రాజీవ్, తైనల విజయ కుమార్, చొక్కాకుల వెంకట రావు, వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ..‘ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషం. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయం వేదికగా విజయం సాధించామో మళ్ళీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరితో కలిసి ముందుకు సాగాలి. కార్యకర్తలకు వైయస్ జగన్ అండగా ఉంటారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు. నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని అని చెప్పారు. మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ..ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైయస్ఆర్‌సీపీ నేతలను ఇబ్బంది పెడుతోందన్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దుతుగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించింది. కూటమికి దోచుకోవడమే కావాలి.. ప్రజలతో సంబంధం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైఎస్ జగన్ సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ఆరు నెలల్లో చంద్రబాబు 72వేల కోట్లు అప్పు తెచ్చి, సంక్షేమానికి 200 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయం ఎండాడలో ఉంది. నగర పార్టీ కార్యాలయం మద్దిలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేశారు. నగర కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చాలా సంతోషం. పార్టీ చేసే పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. 27వ తేదీన కరెంట్ చార్జీలు పెంపుపై నిరసన కార్యక్రమం ఉంది. కూటమికి ప్రజలతో సంబంధం లేదు. మీడియాను పట్టుకొని హడావుడి చేస్తోంది. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. అరకు ఎంపీ తనూజ రాణి మాట్లాడుతూ..అందరం కష్టపడి పని చేద్దాం. వైయస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. కూటమి పాలనలో నిత్యవసర ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగాయి. వైయస్ఆర్‌సీపీ బలం కార్యకర్తలే అని చెప్పారు.