తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నందమూరి లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తెనాలి నియోజకవర్గానికి చెందిన గడ్డేటి సురేంద్రను నియమిస్తూ మరో ప్రకటనను కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేశారు.