మద్యం కేసు  ధైర్యంగా ఎదుర్కొంటాం

 సిట్ విచార‌ణ అనంత‌రం ఎంపి మిథున్ రెడ్డి 

 విజ‌య‌వాడ‌: మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను, ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటామ‌ని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. సిట్ విచార‌ణ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  ``ఈ కేసులో బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉంది.అందుకే మద్యం కేసు గురించి నేను పూర్తిగా మాట్లాడలేను. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇలానే చేస్తున్నారు. మొదట మదనపల్లి ఫైల్స్ తగలబెట్టారు అన్నారు.తర్వాత మైన్స్ లో దోచుకున్నామని ఆరోపణలు చేశారు. ఆరోపణల్లో ఏవి ప్రభుత్వం నిరూపణ చేయలేదు. భూములు ఆక్రమించాం అన్నారు. ఎర్రచందనం తరలించామని అని ఆరోపణలు చేశారు.మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగంగా పెట్టిన కేసు మాత్రమే. నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో కేసు గురించి తేలిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతాను`` అంటూ మిథున్‌రెడ్డి కామెంట్స్ చేశారు.

Back to Top