అమరావతి నిర్మాణంలో పెద్ద కుంభకోణం 

 మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి

అనంతపురం: అమరావతి నిర్మాణంలో పెద్ద కుంభకోణం ఉందని  మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి. ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో చంద్రబాబు అమరావతి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేస్తున్నారు.. కానీ, సూపర్‌ సిక్స్‌ హామీలను చూస్తే భయం వేస్తోందని చంద్రబాబు అంటున్నారు అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. శ‌నివారం వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి  మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా ధనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అస్మదీయులకు దోచి పెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను చూస్తే భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. మరోవైపు వేల కోట్లతో అమరావతిలో కట్టడాలు జరుగుతున్నాయి. రాజధాని అమరావతిలో లక్ష ఎకరాల్లో లక్ష కోట్లతో నిర్మాణం అవివేకం. గన్నవరం ఉండగా అమరావతిలో మరో విమానాశ్రయం ఎందుకు?. 10 మాసాల్లో 1.53 లక్షల కోట్లు అప్పు చేశారు.. ఆ డబ్బు ఏమైంది?. చంద్రబాబుకు అమరావతి తప్ప.. మిగిలిన జిల్లాల అభివృద్ధి అక్కర్లేదా? అని ప్రశ్నించారు.

అలాగే, రాష్ట్ర విభజన పాఠాలు చంద్రబాబు నేర్చుకోలేదు. అభివృద్ధి-అధికార వికేంద్రీకరణ అవసరం లేదా?. శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో చంద్రబాబు అమరావతి నిర్మాణాలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేస్తున్నారు.. కేంద్రం నుంచి గ్రాంట్ ఎందుకు సాధించడం లేదు?. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడం లేదు. టీసీఎస్ పేరుతో 29 ఎకరాల భూమిని 29 రూపాయలకే ఇవ్వడం ఏంటి? ఇది అనుమానాస్పదంగా ఉంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Back to Top