విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుందని ఆరోపించారు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ మేయర్ పీఠం కూటమి గెలుపుపై వైయస్ఆర్‌సీపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..‘యాదవ మహిళకు వైయస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. పార్టీ మారని వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తున్నారు. చావుబతుకుల మధ్య కూటమి సర్కార్ మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకుంది. వైయస్ఆర్‌సీపీ పాలనలో గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో మేం ప్రలోభపెట్టలేదు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయింది. కూటమి నేతలు గెలిచే బలం లేకున్నా అవిశ్వాస తీర్మాన లేఖ ఇచ్చారు. ధర్మం గెలిచిదంటున్న కూటమి నేతలకు మాట్లాడే అర్హత లేదు. కూటమి చావు బతుకుల మీద మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు. కుట్రలు తంత్రాలకు తెర తీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. కూటమిని తట్టుకొని నిలబడ్డ వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏమన్నారంటే.. బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు.. ధర్మం న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదు. మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు. విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు. విప్ ఉల్లంఘించిన వారి పదవులు పోవడం కాదు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ పదవి ఇచ్చారు.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రలోభ పెట్టారు. 99 పైసలకే విశాఖ భూములను ఇష్టానుసారంగా కట్టబెడుతున్నారు. ఇదే తరహాలో భూములు కట్టబెడతామని లోకేష్ చెప్తున్నారు.. టీసీఎస్ విశాఖ రాక ముందే భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు. విశాఖ మేయర్ పీఠం చేతిలో ఉంచుకొని విశాఖను దోచుకోవాలని చూస్తున్నారు. నైతిక విజయం వైయస్ఆర్‌సీపీదే : మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూటమి నిజంగా గెలిచే పరిస్థితి ఉంటే నెల రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు.. జీవీఎంసీ డబ్బులతో ప్రత్యేక విమానాలు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కోసం తీసుకువెళ్లారు.. యాదవ్ కుల ద్రోహులు కూటమిలో ఉన్నారు.. బాబు మహిళా ద్రోహిగా మిగిలిపోయారు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పది నెలల పదవి కోసం ఒక మహిళను పదవి నుంచి దించుతారా?. చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు.. ప్రజలు 164 సీట్లు ఇచ్చిన చంద్రబాబుకు అధికార దాహం తీరలేదు.. వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురి చేశారు. చంద్రబాబు ప్రలోభాలకు పెట్టింది పేరు న్యాయం ధర్మం గెలిచిందని కూటమి నేతలు మాట్లాడడం సిగ్గుచేటు. కుట్రలు తంత్రాలకు మేయర్ ఎన్నికలో గెలిచాయి.