హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన నటుడు అల్లు అర్జున్‌ను వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిసి తన సంఘీభావం ప్రకటించారు. అనంతరం తోట త్రిమూర్తుల మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన ఘటన దురదృష్ట కరమన్నారు.నేషనల్ అవార్డు నటుడి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని తోట త్రిమూర్తులు అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు.. సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. కోర్టు రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరో వైపు హైకోర్టు ఆయనకు సాయంత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ పత్రాలు అందలేదని, సర్టిఫైడ్ కాపీలను తాము పరిగణనలోకి తీసుకోబోమని చెబుతూ జైలు అధికారులు.. అల్లు అర్జున్‌ను విడుదల చేయలేదు. శనివారం ఉదయం విడుదల చేస్తామని ప్రకటించారు. దీనితో అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది. జైలులోని మంజీరా బ్యారక్‌లోని క్లాస్–1 గదిని అల్లు అర్జున్‌కు కేటాయించారు. అల్పాహారం అందించారు. శనివారం ఉదయం 6.15 గంటల సమయంలో జైలు అధికారులు అల్లు అర్జున్‌ను విడుదల చేశారు.