నేడు సీఎం వైయస్ జగన్ మాట్లాడిన తీరు ప్రజలూ, ప్రత్యర్థులే కాదు ఎవ్వరినైనా మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఓ ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి తిరుగులేని అధినేతగా ఉన్నా వినయంగా ప్రజల ఉద్దేశించి మాట్లాడిన తీరు నిజంగా అద్భుతం. డా.ఎ.పి.జె అబుల్ కలాంగారి జయంతి వేడుకలు, అబ్దుల్ కలాం విద్యాపురస్కారాల ప్రదానోత్సవంలో సీఎం ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మదరసాలకు కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు ఆదేశాలిస్తూ, అమ్మ ఒడి పథకాన్ని వారికీ వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు వైయస్ జగన్. దాంతోపాటే వైయస్సార్ పెళ్లి కానుక, మౌజాలు, ఇమామ్‌లకు గౌరవ భృతి పెంపు, మసీదుల నిర్వహణకు 15,000 హామీలను త్వరలోనే నెరవేరుస్తామని. అయితే అవి ప్రారంభించేందుకు కొంచెం సమయం కావాలని వినమ్రంగా ప్రజలనే నేరుగా అడిగారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. మార్చి వరకూ సమయం ఇవ్వండి చాలు ఇచ్చిన మాట ప్రకారం ఆ పథకాలను అమలు చేస్తామని స్పష్టంగా తెలియజేసారు. గతం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రజల పట్ల ఎంత చులకనగా వ్యవహరించేవాడో ఈ సందర్భంలో ఒకసారి గుర్తు చేసుకోవాలి. సమస్యలు చెప్పుకోను వచ్చిన వారిని అవమానకరంగా మాట్లాడటాన్ని కూడా తలుచుకోవాలి. అధికారం ఉందనే అహంకారాన్నీ, దర్పాన్నీ ఎలా ప్రదర్శించేవారు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఏం తమాషాలా, జాగ్రత్తగా ఉండండి..పిచ్చాటలొద్దు అంటూ ప్రజలను బెదిరించిన చంద్రబాబుకూ, కాస్త సమయమివ్వండి మీకిచ్చిన హామీలను నెరవేరుస్తా అంటూ అడిగే వైయస్ జగన్ కూ ఎంత తేడా. నేను పాలకుడిని కాదు ప్రజలకు సేవకుడిని అని సీఎం జగన్ పదే పదే చెప్పే మాటలు ఆచరణలోనూ చూపిస్తున్నారు. కోట్లమంది అభిమానులున్నా, అనంతమైన అధికారం గుప్పెట్లో ఉన్నా వినంమ్రంగా ఉండటం ప్రజల పట్ల ఆయన వైఖరి ఎంటో తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, వాళ్లే సుప్రీం. ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, అధికారలైనా వారికి సేవకులు మాత్రమే అని వైయస్ జగన్ తరుచూ సమీక్షలో చెబుతుంటారు. ప్రజల సమస్యలను సానుకూలంగా వినండి, పరిష్కరించండి, వారితో సున్నితంగా వ్యవహరించమని కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచిస్తుంటారు. చెప్పడమే కాదు ప్రజలతో పాలకుల వ్యవహార శైలి ఎలా ఉండాలో తాను ఆచరించి చూపిస్తున్నారు. ప్రభుత్వం తరఫున జవాబుదారీగా ఉండటం అంటే ఏమిటో ప్రత్యక్షం చూపిస్తున్నారు. మీకిచ్చిన హామీని నెరవేర్చడానికి ప్రభుత్వానికి సమయం కావాలి అంటూ ప్రజలనే ప్రత్యక్షంగా అడగడం, ఎన్ని నెలల్లోపు ఆ పథకాలు అమలు చేస్తారో కూడా స్పష్టంగా చెప్పడం బాధ్యతగల పాలకుడి లక్షణం. ఈ లక్షణమే, ఈ విలక్షణతే ప్రజల మనసుల్లో వైయస్ జగన్ ను చిరస్థాయిగా నిలుపుతోంది. గొప్ప నాయకుడిగా నిలబెడుతోంది. Read Also: ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేత