అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం 2020-21 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం కానుంది. బీఏసీ సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2020-21 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రూ. 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్‌లో కూడా సంక్షేమ పథకాలు, నవరత్నాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2020-21 రాష్ట్ర బడ్జెట్‌కు, వ్యవసాయ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ యాక్ట్-2020 బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.