అనకాపల్లి: ప్రజల ప్రయోజనాలే మా ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో మంత్రి బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సీఎం వైయస్ జగన్ సముచిత స్థానం కల్పించారని తెలిపారు. బస్సు యాత్ర ద్వారా సీఎం వైయస్ జగన్ పాలనలో జరిగిన సామాజిక సాధికారతను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. బాబు నీతిమంతుడు..నిజాయితీపరుడైతే 50 రోజులు జైల్లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. స్కిల్ స్కామ్‌లో సాక్ష్యాధారాలు ఉన్నందునే చంద్రబాబును రిమాండుకు పంపించారని మంత్రి తెలిపారు. అంబేద్కర్, పూలే ఆశయాలను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. కేబినెట్‌తో పాటు నామినేట్ పదవుల్లో పెద్దపీట వేశారని గుర్తు చేశారు. కొన్ని పత్రికలు, టీవీలు, యాత్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో జరిగినట్లు అవినీతి ఈ ప్రభుత్వంలో జరగలేదన్నారు. మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు.