ఉదయం మాటిచ్చి సాయంత్రం ఆర్థిక సాయం అందజేత... 

రాష్ట్ర ముఖ్య మంత్రి కి వినతుల వెల్లువ 

 తిరిగి ప్రయాణంలో వినతుల స్వీకరణ 

 పలువురు  సమస్యల పరిష్కారం నిమిత్తం వినతి పత్రాలు అందజేత 

 సమస్యల పరిష్కారం నిమిత్తం సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి 

 సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి 

 ముఖ్యమంత్రి ఆదేశాలతో    బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ షన్మోహన్... 

చిత్తూరు  :   రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా  నగరి డిగ్రీ కళాశాల నందు తిరుగు ప్రయాణం లో హెలిపాడ్ వద్ద ప్రజల నుండి వినతుల స్వీకరించారు.. వివిధ వర్గాల ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు.. 
సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి  వై. య‌స్. జగన్ మోహన్ రెడ్డి...

1.పిటిషనర్ పేరు:కె.షణ్ముగం

వయస్సు: 36 సం.

చిరునామా: పన్నురు గ్రామము, విజయ పురం మండలం, చిత్తూరు జిల్లా

సమస్య: అంగ వైకల్యం కలిగి ఉన్న తనకు స్వయం ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం కొరకు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. 

 సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి 

 జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సోమవారం  కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు  లక్ష రూపాయల చెక్కు అందజేత.

2. పిటిషనర్ పేరు:ఎ. నాగరాజు

వయస్సు:30 సం.

చిరునామా:మిట్ట పాళ్యo, నగరి మండలం,చిత్తూరు జిల్లా.

సమస్య: కిడ్నీ పూర్తి   గా పని చేయకుండా పోయినదని డయాలసిస్ తో బాధపడు తున్నానని, పెన్షన్ అందు తున్నదని ముఖ్యమంత్రి కి విన్నవించుకోగా... కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు  దాతలు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేస్తామని బాధితునికి ధైర్యం చెబుతూ ఆర్థిక సాయం అందించాలని సంబందిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

 జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో లక్ష రూపాయల చెక్కు అందజేత.

3. పిటీషనర్ పేరు: పి. రహమాన్

వయస్సు:6 సం.

చిరునామా:శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా..

సమస్య: రహమాన్ తల్లి తన కొడుకు  బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్నాడని, క్యాన్సర్ వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు అయిన బిల్లులను  మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ని కోరగా...

స్పందించిన ముఖ్యమంత్రి బాధితురాలికి తానున్నానంటూ ధైర్యం చెబుతూ బ్లడ్ క్యాన్సర్ వైద్య ఖర్చుల నిమిత్తం అయిన  బిల్లులను రీ ఎంబర్స్మెంట్ చేయాలని దీనితోపాటు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేయమని మెరుగైన వైద్యాన్ని అందించాలనిఆదేశించారు. 

 జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం సోమవారం రాత్రి  కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి లక్ష రూపాయల చెక్కు అందజేత.

4.పిటీషనర్ పేరు: ఎం.చందు

వయస్సు:11 సం.

చిరునామా:గోళ్ళకండ్రిగ,కార్వేటినగరం,చిత్తూరు జిల్లా..

సమస్య: చందు తండ్రి తన కొడుకు  బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్నాడని క్యాన్సర్ వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు అయిన బిల్లులను  మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ని కోరగా...

స్పందించిన ముఖ్యమంత్రి బాధితునికి తానున్నానంటూ ధైర్యం చెబుతూ బ్లడ్ క్యాన్సర్ వైద్య ఖర్చుల నిమిత్తం అయిన  బిల్లులను రీ ఎంబర్స్మెంట్ చేయాలని దీనితోపాటు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేయమని మరియు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు 

 జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం సోమవారం రాత్రి  కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి 50 వేల  రూపాయల చెక్కు అందజేత.

5.పిటీషనర్ పేరు: ఎన్. సుమిత్ర

చిరునామా: పుల్లూరు హరిజన వాడ,ఎస్.ఆర్ పురం మండలం.చిత్తూరు జిల్లా

సమస్య: నా భర్త యాక్సిడెంట్ లో మరణించారని, తనకు జీవనోపాధి నిమిత్తం ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కి విన్నవించుకున్నది.

స్పందించిన ముఖ్యమంత్రి బాధితురాలకు ఒక అన్నగా భరోసా కల్పిస్తూ ఈమె కు జీవనోపాధి నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయంను అందజేయాలని, వైయస్సార్ బీమా కింద ఆర్థిక సాయం పొందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు

 జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జీవనోపాధి నిమిత్తం సోమవారం రాత్రి  కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో లక్ష  రూపాయల చెక్కు అందజేత.

6.పిటీషనర్ పేరు: ఐశ్వర్య

చిరునామా: తూకి వాకం,శ్రీ  కాళహస్తి మండలం, తిరుపతి జిల్లా

సమస్య: నాకు ఇద్దరు పిల్లలని ఒక అబ్బాయి ఆరోగ్యం బాలేనందున హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నానని, మరో అబ్బాయికి కనుచూపు సమస్య కలదని చూపు కనపడటం లేదని ముఖ్యమంత్రికి తన ఆవేదనను వ్యక్తం చేసిన బాధితురాలు.

ముఖ్యమంత్రిబాధితురాలు బాధను  ఆలకిస్తూ ధైర్యం చెబుతూ పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇదివరకు వైద్య సేవల నిమిత్తం ఖర్చు చేసిన బిల్లులను రీ ఎంబార్స్మెంట్  చేయాలని అధికారులను ఆదేశించారు

 జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా  సోమవారం రాత్రి  కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో లక్ష  రూపాయల చెక్కు అందజేత.

7. పిటిషనర్ పేరు: ఎం. గజేంద్ర

వయస్సు:35 సం.

చిరునామా:9 వ వార్డు,నెత్తం కండ్రిగ,నగరి మండలం, చిత్తూరు జిల్లా

సమస్య: అంగ వైకల్యం కలిగి ఉన్న తనకు స్వయం ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం కొరకు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. 

స్పందించిన ముఖ్యమంత్రి

 డి ఆర్ ఓ ఎన్. రాజ శేఖర్ చేతుల మీదుగా సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు  50 వేల రూపాయల చెక్కు అందజేత

8. పిటిషనరు పేరు: జి.మత్తయ్య

వయస్సు:37 సం.

చిరునామా:నిండ్ర మండలం

సమస్య: అంగ వైకల్యం కలిగి ఉన్న తనకు స్వయం ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం కొరకు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. 

సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి

 డి ఆర్ ఓ ఎన్. రాజ శేఖర్ చేతుల మీదుగా సోమవారం  రాత్రి కలెక్టర్ క్యాoపు కార్యాలయం లో 50 వేల రూపాయల చెక్కు అందజేత. 

Back to Top