భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి

అర్హున అవార్డు గ్రహీత సాత్విక్‌సాయిరాజ్‌ను అభినందించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: అర్జున అవార్డు గ్రహీత, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు సాత్విక్‌ సాయిరాజ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు సాత్విక్‌ సాయిరాజ్‌ను సీఎం వైయస్‌ జగన్‌ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పినిపె విశ్వరూప్‌ ఉన్నారు. 

Back to Top