గృహ నిర్మాణం, గ్రామ సచివాలయ శాఖపై సీఎం సమీక్ష

తాడేపల్లి: గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై.శ్రీలక్షి్మ, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

Back to Top