కాంట్రాక్ట్ ఉద్యోగుల స్థితిగతులపై సీఎం సమీక్ష
ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ఆదేశం
తాడేపల్లి: కాంట్రాక్టు ఉద్యోగులు సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ఆదేశించారు. గ్రీన్‌ఛానల్‌లో పెట్టి నిర్ణిత సమయానికే జీతాలు ఇవ్వాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్టు ఉద్యోగులకూ సామాజిక, ఆరోగ్య భద్రతపై అధ్యయనం చేయాలన్నారు. ఈ అంశంపై నివేదికను త్వరగా ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.