రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌
 

తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మన సంస్కృతిని– మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను– విజయాలను, ఈ నేల పై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం అంటూ సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
 

Back to Top