తాడేపల్లి: ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తివంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకున్నారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.