రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి కాకినాడ పోర్టు అంశం

ఇదో కొత్త కుట్ర. తెర ముందు కేవీ రావు. వెనుక చంద్రబాబు

 మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్‌

కొత దుష్ట సంప్రదాయానికి తెర తీసిన చంద్రబాబు

కాకినాడ పోర్టులో ఆరు నెలల నుంచి బియ్యం అక్రమ రవాణా

అరబిందోపైన, జగన్‌పైనా బురద చల్లేందుకు చంద్రబాబు కుట్ర

వైయ‌స్ఆర్‌సీపీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం

కాకినాడ పోర్టులో బలవంతంగా వాటా లాక్కున్నారని దుష్ప్రచారం

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం

కాకినాడ పోర్టును ప్రైవేటుపరం చేసిందే చంద్రబాబు

ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న పోర్టును కేవీరావుకు కట్టబెట్టారు

అందులో చంద్రబాబు బినామీ అనే ప్రచారమూ ఉంది

ఆ వ్యవహారంపై 2019 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ విమర్శలు

చంద్రబాబు తన మనుషులకు పోర్టు కట్టబెట్టారని ఆరోపణ

అర్హత లేని కేవీ రావుకు పోర్టు ఎలా కట్టబెట్టారని నిలదీత

కూటమిలో చేరగానే అన్నీ మర్చిపోయిన పవన్‌కళ్యాణ్‌

గుర్తు చేసిన మాజీ మంత్రి కాకాణి

బెదిరించి పోర్టులో వాటాలు తీసుకున్నారనేది అవాస్తవం

41 శాతం వాటాలను రూ.494 కోట్లకు కొనుగోలు

మిలిగిన 59 శాతం వాటాలు కేవీరావు వద్దే ఉన్నాయి

కాకినాడ పోర్టులో నిర్ణయాధికారాలన్నీ కెఎస్‌పీఎల్‌ వద్దే

నిజంగా బెదిరించి వాటాలు తీసుకుంటే నాలుగేళ్లు ఏం చేశారు?

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఆరు నెలలు

మరి ఇన్నాళ్లూ కేవీ రావు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

కేవలం చంద్రబాబు ఒత్తిడితోనే ఇప్పుడు కేవీ రావు ఫిర్యాదు

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కాకాణి స్పష్టీకరణ

తాడేపల్లి: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కొత్త దుష్ట సంప్రదాయాన్ని తీసుకువచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. చంద్రబాబు తన పాలనలోని తప్పుడు విధానాలపై ప్రజల దృష్టి మళ్ళించేలా డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఆ దిశలో తన రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. బుధ‌వారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 పాలనా వైఫల్యాలు. కక్ష సాధింపులు:
    రాష్ట్రంలో పాలనా వైఫల్యాలతో కూటమి ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. దీంతో ప్రజల దృషి మళ్ళించేందుకు ఒక నియంతలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. తనను ఎవరూ ప్రశ్నించకూడదనే లక్ష్యంతో ప్రత్యర్ధులపై కుట్రలు, కుతంత్రాలతో తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో చట్టబద్దంగా జరిగిన వ్యవహారాలు, లావాదేవీలను తిరగదోడి వాటిపై బలవంతంగా ఫిర్యాదులు ఇప్పిస్తూ, తాను శతృవులుగా భావించిన వారిపై అక్రమ కేసులను బనాయిస్తున్న దారుణమైన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొంది. 

పోర్టు పేరుతో వైయస్సార్‌సీపీపై కుట్ర:
    కాకినాడ పోర్టు అంశాన్ని చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఆ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌ (కెఎస్‌పీఎల్‌)లో బలవంతంగా వాటాలు లాక్కున్నరంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దానిపై బలవంతంగా ఫిర్యాదు చేయించడమే కాకండా, తన అనుకూల పత్రికల్లో వార్తలు రాయించి, జగన్‌గారిపైనా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడిపైనా, విజయసాయిరెడ్డిగారిపైనా తప్పుడు కేసులు పెట్టించేందుకు కుట్ర చేస్తున్నారు. 

నాడు ఇదే పోర్టుపై పవన్‌ నిశిత విమర్శలు:
    నిజానికి ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న కాకినాడ పోర్టును ప్రైవేటుపరం చేసింది చంద్రబాబే. తన అనుయాయుడైన కేవీరావు సంస్థకు చంద్రబాబు పోర్టును కట్టబెట్టారు. ఆ కేవీ రావు వెనుక చంద్రబాబు బినామీగా ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
    ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్‌కళ్యాణ్, ఇదే కాకినాడ పోర్టు వ్యవహారంపై 2019లో అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు..
అంటూ ప్రెస్‌మీట్‌లో ఆ వీడియో ప్రదర్శించారు.
    ఏ మాత్రం అర్హత లేని కేవి రావు సంస్థకు కాకినాడ పోర్టును ఎలా కట్టబెట్టారంటూ నాడు పవన్‌కళ్యాణ్, అప్పటి సీఎం చంద్రబాబును నిలదీశారు. అదే పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు కూటమిలో ఉన్నారు. దాంతో గతమంతా మర్చిపోయారా? అప్పుడు తప్పైన పోర్టు వ్యవహారం, ఇప్పుడు సరైనదిదా కనిపిస్తోందా? 

అవి తప్పని పవన్‌ అంగీకరిస్తారా?:
    నాడు సీఎం చంద్రబాబు, కేవీరావు గురించి పవన్‌కళ్యాణ్‌ అన్న మాటలు మారవు. కానీ ఆయన ఇప్పుడు రాజకీయ పంథా మార్చుకున్నారు. మరి ఆరోజు చంద్రబాబు చేసింది సరైనదే అయితే, అప్పుడు తాను కాకినాడ పోర్టు ప్రైవేటీకరణపై మాట్లాడిన మాటలు తప్పు అని పవన్‌కళ్యాణ్‌ అంగీకరిస్తారా? లేదు. నా మాటలకు కట్టుబడి ఉంటాను, అంటే.. చంద్రబాబు తప్పు చేశారని బహిరంగంగా మరోసారి మాట్లాడగలరా?

అది పూర్తిగా అసత్యం:
    కెఎస్‌పీఎల్‌ నుంచి అరబిందో సంస్థ బెదిరించి వాటాలు కొనుగోలు చేసిందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. 2020లో రూ.494 కోట్లతో ఆ సంస్థ నుంచి 41 శాతం వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. 150 దేశాల్లో వ్యాపారాలు చేస్తున్న అరబిందో గ్రూప్, వాటాల కోసం కేవీ రావు సంస్థను బెదరించిందనడం దారుణం. 
    ఇప్పటికీ కెఎస్‌పీఎల్‌కు 59 శాతం అంటే, మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఆ సంస్థే తన అధికార యంత్రాంగంతో పోర్టుపై పూర్తి అజమాయిషీ చేస్తోంది. నిజంగా బెదిరించి వాటాలు లాక్కోవాలని అనుకుంటే మొత్తం వాటాలనే తీసుకుని ఉండే వారు కాదా? వాటాల బదిలీ జరిగి నాలుగేళ్ళు గడిచినా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల వరకు కూడా కేవీ రావు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.

ఇప్పుడే ఎందుకు అంటే?:
    ఎప్పుడైతే కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా అంశం బయటకు వచ్చిందో, అప్పుడే హటాత్తుగా కేవీ రావు బయటకు వచ్చి ఫిర్యాదు ఎలా చేశారు? దీని వెనుక చంద్రబాబు బలవంతం లేదా? వైయస్‌ఆర్‌సీపీపై బురద చల్లాలని, పార్టీ నాయకులపై కేసులు బనాయించేందుకే కేవీ రావును పావుగా వాడుకుని ఫిర్యాదు చేయించానేది వాస్తవం కాదా? 

బాబు విధానాలతో వారంతా హడల్‌!:
    రాష్ట్రంలో చంద్రబాబు అనుసరిస్తున్న ఈ తాజా విధానాలతో కొత్తగా ఈ రాష్ట్రానికి వచ్చేందుకు ఏ పారిశ్రామికవేత్త సాహసం చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న వారు కూడా పారిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో చంద్రబాబు కూడా తన హెరిటేజ్‌ సంస్థ వాటాలను ఫ్యూచర్‌ గ్రూప్‌నకు విక్రయించాడు. మరి ఈరోజు ఆ గ్రూప్‌ తమతో బలవంతంగా అప్పుడు వాటాలను కొనిపించారని ఫిర్యాదు చేస్తే, చంద్రబాబు పైన కూడా కేసులు నమోదు చేస్తారా?.
    చంద్రబాబు ఒక తప్పుడు విధానానికి శ్రీకారం చుట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏకంగా రాష్ట్రాన్ని ఫణంగా పెడుతున్నారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా వాటిని వైయస్సార్‌సీపీ ప్రజాబలంతో ఎదుర్కొంటుందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top