కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదుచిల్లర దుకాణాలు కూల్చడం దారుణంహోం మంత్రి జిల్లాలో మైనర్ బాలికలపై అత్యాచారం సిగ్గు చేటుపారిశ్రామికవేత్తలను బెదిరిస్తే పరిశ్రమలు వస్తాయా?అనసూయమ్మ కుటుంబానికి వైయస్ జగన్ అండఎమ్మెల్యే కొలికపూడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనంవేద విద్యార్ధుల మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతిస్విట్జర్లాండ్లోనూ అవే పనికిమాలిన కబుర్లు.. విమర్శలుభావితరాలకు సామాజిక న్యాయ మహాశిల్పం స్పూర్తిదాయకం
సీఎం వైయస్ జగన్ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరు
13 Jul 2022 5:55 PM
టీడీపీ జీతగాడు రాబిన్‌శర్మ సంస్థతో బోగస్ సర్వే
ఇలాంటి సర్వేలు వైయస్‌ఆర్ సీపీని ఏం చేయలేవు..
మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్‌ఆర్ సీపీ అధ్యక్షులు పేర్ని నాని
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రాఫ్ తగ్గిందనడం విచిత్రంగా ఉందని, మునిగిపోతున్న టీడీపీని కాపాడుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి బోగస్ సర్వేను బయటకు వదిలారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్‌ఆర్ సీపీ అధ్యక్షులు పేర్ని నాని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే ఏమిటో ప్రజలకు తెలుసు.. ఇలాంటి సర్వేలు ఏం చేయలేవు.. వైయస్ జగన్ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరని చెప్పారు. వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వంపై, వైయస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడిందన్నారు.
సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదని, అలాంటప్పుడు వాళ్లు రిపోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా మరి ఎలా ఇస్తారన్నారు. పవన్ కల్యాణ్ ద్వారా టీడీపీ గ్రాఫ్ పెంచుకోవాలని చూశారని, అది సాధ్యం కాలేదన్నారు. తండ్రీకొడుకులు నారా చంద్రబాబు, లోకేష్ వల్ల తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ లేవడం లేదని, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ తరువాత టీడీపీలో ఏం లేదని వాళ్లకు తెలిసిపోయిందని పేర్ని నాని అన్నారు.