తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ రక్తదాన శిబిరం, సేవా కార్యాక్రమాలు నిర్వహించారు. బర్త్ డే వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో.. జగన్‌కు విషెస్ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, కల్పతారెడ్డి, వెల్లంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పుత్తా ప్రతాప్‌రెడ్డి, పుత్తా శివశంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.