పొదలకూరులో ఖాళీ అవుతున్న టీడీపీ

మంత్రి కాకాణి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
 

నెల్లూరు: స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష టీడీపీకి షాక్ త‌గులుతోంది. పొద‌ల‌కూరు మండ‌లంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, పులికొల్లు, వెంకటాపురం గ్రామాలకు చెందిన తెలుగుదేశం ప్రధాన నాయకులు  కొరపాటి రంగయ్య నాయుడు, కొమ్మి శ్రీనివాసులు నాయుడు, గుంజి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీని వీడి, వ్యవసాయ శాఖ మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి మంత్రి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పార్టీలో చేరిన వారు తెలిపారు. 

Back to Top