టీడీపీ శవ రాజకీయాలు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి

పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ శవ రాజకీయాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ గుంటలో పడి ప్రమాదవశాత్తు నలుగురు బాలురు చనిపోయారు. గురజాలలో జరగబోయే లోకేష్ సభకు వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చెప్పాలని చనిపోయిన ఇద్దరు బాలురు కుటుంబ సభ్యులపై యరపతినేని ఒత్తిడి చేస్తున్నాడని ఎమ్మెల్యే కాసు ధ్వజమెత్తారు. తనకు వ్యతిరేకంగా లోకేష్ దగ్గర చెప్తే ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానంటూ యరపతినేని శ్రీనివాసరావు ప్రలోభాలు పెడుతున్నారని కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు.

Back to Top