ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండో విడత సామాజిక సాధికార యాత్ర శ్రీకాకుళం జిల్లా నరనస్నపేట నియోజకవర్గంలో జనం జయజయ ధ్వానాల హోరులో ఉత్సాహంగా ప్రారంభమైంది. బస్సు యాత్రలో పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల తీరును పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించారు. నరసన్నపేట పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు స్పీకర్ తమ్మినేని సీతారామ్, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదారవు, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, రెడ్డి శాంతి తదితరులు హాజరయ్యారు. సమర్థ, సమగ్ర, సంక్షేమ పాలన జగన్ తోనే సాధ్యం , చంద్రబాబు కంటే ఐదు రెట్లు అధికంగా జగన్ ఉద్యోగాలు కల్పించారు- మంత్రి ధర్మాన ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..సమర్థవంతమైన, సమగ్రమైన, సంక్షేమ పాలన జగన్ చేస్తున్నారని, రాష్ట్రంలో జరిగిన మార్పులను అంతా గమనించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన వసతులు, సౌకర్యాలను జగన్ పాదయాత్ర చేసినపుడు గమనించి, సీఎం కాగానే అందరికీ అమలు చేసారని, దీని కోసం ఎవరూ యుద్ధాలు, పోరాటాలు చేయలేదని గుర్తు చేసారు. వెనుకబడిన వర్గాలు తమ అవసరాల కోసం అడగడానికి బలం, బలగాలు లేకుండా పోయాయని, కానీ జగన్ మాత్రం బడుగులకు అండగా నిలిచారని గుర్తు చేసారు. 29 రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు, ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నారని, ఏ రాష్ట్రంలో మన రాష్ట్రం కంటే తక్కువగా నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నాయో చెప్పాలని విపక్షాలను ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేసారు. చంద్రబాబు కంటే ఐదు రెట్లు అధికంగా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు కల్పించారని, వేర్వేరు విద్యార్హతలు కలిగిన వారికి కూడా ఉద్యోగాలివ్వబోతున్నారని వివరించారు. చంద్రబాబు, జగన్ పాలనల వ్యత్యాసాలను గమినించేందుకు సమీపంలో ఉన్న ఆసుపత్రులు, పాఠశాలల్లోనూ పరిస్థితులను ప్రజలు పరిశీలించి ఆలోచన చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రయోజనం కలిగించేలా సంస్కరణలు చేపట్టి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. పేదల అభ్యున్నతి కోసం అసైన్డ్ ల్యాండ్ పై పూర్తి హక్కులు కల్పిస్తూ చట్టం తీసుకువచ్చి బడుగులను కోటీశ్వరులను జగన్ చేసారన్నారు. చంద్రబాబుకు ఓటేయ్యమని ఎవరైనా మీ ఇంటికి వస్తే, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసారో చెప్పాలని ప్రజలు నిలదీయాలని ధర్మాన పిలుపునిచ్చారు. అభివృద్ధి విషయంలో ఓట్లడిగిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చకు రమ్మనమని అడగాలని సూచించారు. పేదల్లో ఆర్థిక శక్తి పెరగడంతో రాష్ట్ర జీడీపీ పెరిగింది, కేంద్ర సూచీల్లో రాష్ట్రానిదే అగ్రస్థానం - స్పీకర్ తమ్మినేని స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ, పాలనలో మార్పు తీసుకురావడానికి జగన్ శ్రీకారం చుట్టినందునే సామాజిక సాధికారత సాధ్యమైందన్నారు. జగన్ పాలనలో అభివృద్ధి సూచీల్లో రాష్ట్రం అగ్రస్థాయికి చేరిందని, ఇది కేంద్రం సైతం గుర్తించిందని వివరించారు. జీడీపీ పెరుగుదల అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ లోకపోగా, సీట్లు కూడా ఖాళీ లేని పరిస్థితి జగన్ పాలనలోనే వచ్చిందన్నారు. అవినీతి లేని పాలన, నీతివంతమైన పాలన అందిస్తామని, ప్రజలు జీవన ప్రమాణాలు పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు జగన్ పాలన సాగించారని గుర్తు చేసారు. అర్హతలే ప్రమాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను అర్హులకు అందజేస్తున్నారని, టీడీపీకి ఏజెంట్లుగా పని చేసిన వారికైనా సరే అర్హత ఉంటే మంజూరు చేసి లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. ప్రజల సొమ్ములను తమ ఖాతాల్లోకి మళ్లించుకుని కుంభకోణాలకు టీడీపీ నేతలు పాల్పడ్డారని, సీఎం జగన్ పేదలకు అండగా నిలిచేందుకు వారి ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తున్నారని వివరించారు. రైతు భరోసా కార్యాలయాలు కట్టి రైతుల అధికార కార్యాలయంగా మార్చిన ఘనత వైయస్సార్ సీపీ ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి స్కిల్ స్కామ్ పేరుతో కోట్ల రూపాయలను దోచుకుని చంద్రబాబు జైలు పాలయ్యారని మండిపడ్డారు. పేదల కోనుగోలు శక్థి పెరిగినందున ఆర్థిక సామార్థ్యం కూడా పెరిగిందన్నారు. తద్వారా రాష్ట్ర జీడీపీ పెరిగిందని, ఇందుకు జగన్ పాలనా దక్షత కారణమని వివిరించారు. ముఖ్యమంత్రి అంటే ప్రజల ఆస్తులకు ధర్మకర్త వంటి వారని, కానీ చంద్రబాబు వంటి వారు ఊర్లకు ఊర్లను దోచుకుని, ఆలీబాబు దొంగల ముఠా వలె దోపిడీ చేసారని తమ్మినేని సీతారామ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ ని మళ్లీ సీఎం చేసుకోవడం ప్రజల చారిత్రక కర్తవ్యం అని తమ్మినేని ఉద్ఘాటించారు. 23 సంస్థలను కేంద్రం రాష్ట్రానికిస్తే టీడీపీ శ్రీకాకుళానికి ఒక్కటీ ఇవ్వలేదు - మంత్రి సీదిరి పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ,. వెనుక బడిన శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన వర్గాలకు చెందిన తమ్మినేని సీతారామ్ కు స్పీకర్ పదవి ఇస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చొబెట్టడానికి కూడా రాలేదని, అదే సీఎం జగన్ దగ్గరుండి సీట్లో కూర్చొబెట్టి బీసీలకు తాను ఇచ్చే గౌరవం ఏమిటో చాటి చెప్పారని వివరించారు. బీసీలను అవమానించిన చంద్రబాబు ఎక్కడ, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం నిలిపిన జగన్ స్థానం ఎక్కడో ప్రజలు ఆలోచించాలని సూచించారు. 14 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏమీ చేయకపోగా, ఇప్పుడు అధికారం ఇస్తే మళ్లీ సంపద సృష్టించేస్తానని మాయ మాటలు చెబుతున్నాడని ఎద్దేవా చేసారు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు సంక్షేమ బాధ్యత జగన్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. 23 సంస్థలను కేంద్రం రాష్ట్రానికి ఇస్తే వాటిలో ఒకటి కూడా శ్రీకాకుళం జిల్లాకు తేలేని చేతకాని ఎంపీ రామ్మోహన్ నాయుడు అని విమర్శించారు. జగన్ హయాంలో మూల పేట పోర్టు తీసుకువచ్చి ఉపాధి కోసం వలస వెళ్లే అవకాశం లేకుండా చేసారని గుర్తు చేసారు. *ప్రజా ఆరాధ్య నాయకుడు జగన్ ని మళ్లీ సీఎం చేసుకోవాలి - ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నభూతో న భవిష్యత్తు అన్నారు. ఆయన లాంటి నాయకుడు లేడు, భవిష్యత్తులో రారు అని కొనియాడారు. మహిళలకు సామాజిక, రాజకీయ గౌరవం, భరోసాను జగన్ ఇస్తున్నారని,. జగనన్న కాలనీలు పేరిట ఊర్లకు ఊర్లు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో మంచి పాలన సాగుతుందని,. విపక్షాలన్నీ కలసి ప్రజల మనుసుల్లో ఉన్న నాయకుడుని ఓడించడానికి తయారవుతున్నారని మండిపడ్డారు.. ఆరాధ్య నాయకుడైన జగన్ ను మళ్లీ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తూ విపక్షాలు రాజకీయాలు చేస్తూ వైయస్సార్ సిపి ప్రభుత్వం పట్ల ప్రజల మనసుల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నరసన్నపేట.. జగన్ అన్న అభిమాన కోట - ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ, నాగావళి, వంశధార నదులు కలసి పోటెత్తుతున్నట్లుగా సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు తరలివచ్చారని అన్నారు. జనసందోహాన్ని చూస్తుంటే ఇది నరసన్నపేట కాదు జగనన్న అభిమాన కోట గా కనిపిస్తోందని అభివర్ణించారు. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు గర్వంగా తలెత్తుకునేలా జగన్ చేసారని, అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత వైయస్సార్ సీపీ ప్రభుత్వానిదన్నారు. జగనన్న నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో 175 సీట్లు ఖచ్చితంగా గెలుచుకోవడం ఖాయమని ఉద్ఘాటించారు. 32 లక్షల ఇళ్ళు పేదలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ వంటి నేతలను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా చూసారా అని ప్రశ్నించారు. One a