కొలువుదీరిన కొత్త పాలక‌ మండ‌ళ్లు

 11 న‌గ‌ర పాల‌క‌ సంస్థ‌లు వైయ‌స్ఆర్‌సీపీ సొంతం

74 మున్సిపాలిటీలు వైయ‌స్ఆర్‌సీపీ కైవ‌సం

బాధ్య‌త‌లు చేప‌ట్టిన మేయర్లు,  డిప్యూటీ మేయర్లు‌, చైర్మన్లు,  వైస్ చైర్మ‌న్లు

 అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌లో 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండ‌ళ్లు కొలువుదీరాయి. కొద్దిసేప‌టి రాష్ట్ర వ్యాప్తంగా మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, మున్సిప‌ల్ చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు ప్ర‌మాణ స్వీకారం చేశారు. 9 ఏళ్ల తర్వాత గ్రేటర్‌ విశాఖ పాలకమండలి కొలువుదీరింది. విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌ ఎన్నికయ్యారు. చిత్తూరు మేయర్‌గా అముద, డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌ ఎన్నికయ్యారు. గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్ర బాబు ఎన్నికయ్యారు.  మచిలీపట్నం మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ, తిరుపతి మేయర్‌గా డా.శిరీషా, విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌, చిత్తూరు మేయర్‌గా అముద, చిత్తూరు డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌,  విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మీ, విజయవాడ డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గ, క‌ర్నూలు మేయ‌ర్‌గా బీవై రామ‌య్య‌, అనంత‌పురం మేయ‌ర్‌గా మ‌హ‌మ్మ‌ద్ వ‌సీం స‌లీం ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

రాష్ట్రంలోని వైయ‌స్ఆర్‌సీపీ మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, మున్సిప‌ల్ చైర్మ‌న్ల వివ‌రాలు ఇలా..

 

 

 

Back to Top