సీఎం అధ్యక్షతన మానవహక్కు కమిషన్‌ సమావేశం

రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సీతారామ మూర్తి

సచివాలయం: రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ చైర్‌ పర్సన్, సభ్యుల ఎంపికపై సచివాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిటీ ఛైర్‌ పర్సన్, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్, శాససనభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్, సభ్యుల పేర్లను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రతిపాదించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామ మూర్తి, సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం(జ్యుడీషియల్‌), న్యాయవాది డాక్టర్‌ జి శ్రీనివాసరావు (నాన్‌ జ్యుడీషియల్‌)లను ప్రతిపాదించగా.. కమిటీ ఆమోదం తెలిపింది. 

Back to Top