బాలకృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చగొడుతున్నారు

మంత్రి అంబటి రాంబాబు

అమ‌రావ‌తి:  టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చ‌గొడుతున్నార‌ని మంత్రి అంబ‌టి రాంబాబు త‌ప్పుప‌ట్టారు. టీడీపీ సభ్యుల తీరుతో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంద‌ని మంత్రి అంబటి అనుమానం వ్య‌క్తం చేశారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి స్పీక‌ర్‌ను కోరారు. టీడీపీ సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నార‌ని త‌ప్పుప‌ట్టారు.  అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు తాము చేసిన తప్పును ఒప్పుకోవాలని సూచించారు.  ఒక అంశాన్ని టీడీపీ అంగీకరించాలని నా విజ్ఞప్తి.. చంద్రబాబు 45 ఏళ్ల జీవితంలో అనేక పాపాలు, ఘోరాలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతగా ఉండి ఎన్టీఆర్ పై పోటీ చేస్తానని చెప్పి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచారు.. టీడీపీలో చేరిన తర్వాత పిల్ల ఇచ్చిన మామకు కూడా వెన్నుపోటు పొడిచారు.. ఎన్టీఆర్ మరణానికి కారణం అయ్యారు.. డబ్బు మదంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు.. ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారంటూ విమర్శలు గుప్పించారు.

 
వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు చచ్చిన సామెత ఇప్పుడు గుర్తుకు వస్తుందన్నారు అంబటి రాంబాబు.. కుంభకోణమే జరుగలేదు, రాజకీయ కక్ష సాధింపు అని అంటున్నారు.. రాజకీయ కక్ష సాధింపు లేదని నేను ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.. ఇప్పటి వరకు అవినీతి చేసినా దొరకకుండా తప్పించుకున్నారు.. ఇప్పుడు పూర్తి ఆధారాలతో దొరికి పోయారు. అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు తప్పును ఒప్పుకోండి.. బుకాయించకుండా ప్రజల మద్దతు పొందండి అంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి అంబ‌టి రాంబాబు సలహా ఇచ్చారు .

Back to Top